Health Tips : ఈ పండు 100 రోగాలను తగ్గిస్తుంది.. మీరూ ట్రై చేయండి..!
Health Tips : మనకు తెలియదు గానీ.. ఈ భూమ్మీద ఎన్నో రకాల చెట్లు మన రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడుతాయి. కాకపోతే ఆ విషయం మనకు తెలియదు. ఆయుర్వేదంలో ఇలాంటి చెట్ల గురించి చాలా కూలంకుసంగా వివరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఫలం గురించే మనం చెప్పుకోబోతున్నాం. అదే తొగరు ఫలం. ఇది పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ పెరగదు. అయితే ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పండు అని తెలుస్తోంది. ఇది 100 కు పైగా రోగాలను తగ్గిస్తుందంట.
దీన్ని తింటే మన బాడీలో ఈజీగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందంట. ఇందులో యాంటీ-ఒబేసిటీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి మన శరీరంలోని చెడు కొవ్వును ఈజీగా తగ్గిస్తాయి. దీంతో పాటే బ్లడ్ లోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. ఈ పండులో బీటా-గ్లూకాన్స్ అలాగే కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళలకు అద్భుతంగా పని చేస్తాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నుంచి ఇవి రక్షిస్తాయి. దీన్ని నోని ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు చెట్టు ఎలాంటి రకమైన నేలలో అయినా త్వరగానే పెరుగుతుంది.
Health Tips : షుగర్ లెవల్స్ కంట్రోల్..
ఇవి తీపిగా ఉండవు. కొంచెం వగరుగా ఉంటాయి. అయినా సరే తింటే మాత్రం కీళ్ల నొప్పులను చిటికెలో తగ్గిస్తుంది. ఈ పండులో 150 కి పైగా పోషకాలు ఉండటం విశేషం. అయితే దీన్ని ఎవరు పడితే వారు తీసుకోవద్దు. కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్న వారు అయితే అస్సలు తీసుకోవద్దు. అంతే కాకుండా హై బీపీ ఉన్న వారు కూడా తీసుకోవద్దు. అలాగే చిన్న పిల్లల తల్లులు కూడా దీనికి దూరంగా ఉండాలి. కాబట్టి దీన్ని డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది. వృద్ధులు ఈ పండును తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.