Health Tips : ఉదయం లేవడానికి బద్దకమా… ఈ చిట్కాతో మీరు అనుకున్న సమయానికి లేస్తారు…
Health Tips : చాలామంది ఉదయం నిద్ర లేవడానికి చాలా బద్ధకిస్తుంటారు. ఉదయం అనుకున్న సమయాన్ని అస్సలు లేవరు. మనిషి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఆ విధంగా చేస్తే శరీరానికి అందవలసిన విశ్రాంతి అందుతుంది. ఉదయం ఈ టైం కి లేవాలి. అనుకుంటే దానికి అనుగుణంగా నిద్ర లేస్తూ ఉంటారు. మనం తొందరగా లేవాలని అలారం పెట్టి మరి నిద్రపోతుంటాం కానీ సమయం అయ్యేసరికి ఆ అలారం మోగుతూనే ఉంటుంది. కానీ మనం మాత్రం అస్సలు లేవము. మనిషి ఒక రోజులో సుమారు 7 నుండి 8:00 వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గా టెక్నాలజీని వాడుతూ నైట్ 12 ఒకటి ఆ సమయంలో పడుకోవడం తెల్లవారిన తర్వాత 8, 9 గంటలకి నిద్ర లేవడం ఇప్పుడు ప్రస్తుతం అలాగే జరుగుతుంది.
అదే పల్లెటూర్లైతే ఈ విధంగా జరగదు కచ్చితంగా 9 గంటలకి నిద్రిస్తారు తెల్లవారుజామున 5:00కి లేస్తారు. ఈ విధంగా నిద్రలేచిన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే అనుకున్న సమయానికి నిద్రలేవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ఎక్ససైజ్: సహజంగా ఉదయం తొందరగా లేచి ఏం చేస్తాంలే ఇంకా ఆఫీస్కి, కాలేజీకి వెళ్లడానికి ఇంక చాలా టైముంది. అనే భావనతో బద్దకంగా ప్రవర్తిస్తూ నిద్ర లేవడం ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ప్రతినిత్యము ఉదయం వ్యాయామం, వాకింగ్ చేయడానికి హ్యాబిట్ గా మార్చుకుంటే తప్పకుండా ఉదయం తొందరగా లేవడానికి అలవాటు పడతారు. ఇలా చేయడం వలన ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగాను, ఉల్లాసంగానూ ఉంటారు. శరీర భాగాలు చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉంటాయి. మంచి బ్రేక్ ఫాస్ట్ : ఉదయం త్వరగా లేచి ఆకలిగా ఉన్నప్పుడు టైయానికి ఎక్కువ సమయం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మంచి పోషకాహారాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోవడం వలన శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుంది.
ఇంకా దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. పనిని ముందే ప్లాన్ చేసుకోవడం: ఎక్సర్సైజు చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలో ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా తప్పనిసరిగా ఆ పని చేయాలని ఆలోచన మొదలై అనుకున్న సమయానికి లేవడం అలవాటైతుంది. ఇలా చేయడం వలన బద్దకానికి దూరమై నిద్ర త్వరగా లేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా : ఒక మనిషి సరియైన సమయం నిద్రపోకుండా చేస్తున్న వాటిలలో ఫస్ట్ ది ఫోన్. ఇప్పుడున్న యువతరం ఎక్కువగా ఈ ఫోన్ కి బాగా అలవాటు పడి నిద్రకి దూరమవుతున్నారు. పడుకునే ముందు ఫోన్లకి అలవాటయి వాటిపై ఎంత టైం గడుపుతున్నామో కూడా తెలీక నిద్రపోయే సమయాన్ని తగ్గించుకుంటున్నారు. ఇక దీంతో ఉదయం లేవడానికి చాలా బద్దకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకం తగ్గించడం వలన అనుకున్న సమయానికి నిద్రలేవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.