Diet Food : ఈ పండ్లను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ ప్రమాదం తప్పదట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diet Food : ఈ పండ్లను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ ప్రమాదం తప్పదట..!

 Authored By tech | The Telugu News | Updated on :18 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Diet Food : ఈ పండ్లను రాత్రి సమయంలో తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఈ ప్రమాదం తప్పదట..!

Diet Food : ప్రస్తుతం చాలామంది కొన్ని రకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. అలా అనారోగ్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో అన్నం మానేసి పండ్లను తింటున్నారు.. అయితే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.. కానీ రాత్రి సమయంలో ఈ పండ్లను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనివలన కొన్ని రకాల సమస్యలు ఎదురుకోవలసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పగటిపూట పండ్లు తినడం చాలా మంచిది. పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలని ఈ పండ్ల ద్వారా లభిస్తాయి. అందుకే అవి ఎన్నో వ్యాధుల నుండి రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో పండ్లను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఉపయోగకరంగానే ఉంటుంది.

ఇది ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అయితే పగలు లేదా రాత్రి పండ్లు తినడం వలన ఉపయోగకరమో తెలుసా..? పండ్లు రాత్రి సమయంలో తినాలా.. పగటిపూట తినాలా.. అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.. కొన్ని పండ్లలో ప్రక్టోజ్ అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే వీటిని ఉదయం పూట తినడం మంచిది. రాత్రిపూట విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరానికి ఉదయం మేల్కొన్నప్పుడు చాలా శక్తి కావాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రక్టోజ్ ఉన్న వస్తువులను వెంటనే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లను తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అందువలన పండ్లతో రోజు ప్రారంభించడం మంచిది కాదని తెలుపుతున్నారు.. పడుకునే ముందు కొన్ని ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది. ఇది నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది.

కావున ప్రాసెస్ చేసిన షుగర్ ఉన్న ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం మానుకోవాలి. కావున పండ్లు కూడా పగటిపూట మాత్రమే తీసుకోవాలి. అయితే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియలో ఎటువంటి ఆటుపోట్లు ఉండవు. రాత్రి సమయంలో పండ్లు తీసుకోకుండా ఉంటేనే మంచిదాన్ని నిపుణుల అభిప్రాయం నిజానికి సాయంత్రం తర్వాత శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఇటువంటి సమయంలో పండ్లు వాటిలో ఉండే పోషకాలు సరిగా జీర్ణం అవ్వవు. రాత్రి పడుకునే ముందు పండ్లు తింటే మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మీ నిద్రని ప్రభావితం చేస్తాయి. పండ్లు తిన్న తర్వాత కనీసం ఒకటి రెండు గంటల వరకు ఏదైనా తినకుండా శరీరాన్ని రక్షించుకోవాలి. దాని వలన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించుకుంటుంది.

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది