Helth Tips : వెల్లుల్లితో సెగ గడ్డలకు చెక్.. ఇలా చేస్తే ఎప్పటికీ ఈ సమస్య ఉండదు
Helth Tips: వేసవిలో సెగ గడ్డలు సర్వసాధారణం. శరీరంలో అధిక వేడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఇన్ఫెక్షన్లు ఇలా రకరకాల కారణాల వల్ల చర్మంపై సెగ గడ్డలు ఏర్పడుతుంటాయి. చిన్నసమస్యే అయినప్పటికీ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇవి దురద మరియు చీముతో కూడుకుని బాగా ఇబ్బంది పెడతాయి. ఈ సెగ గడ్డలు, షేవ్ చేయడం వలన కలిగే గాయాలు మరియు ఇన్ఫెక్షన్ల వంటి ఇతర కారణాల వలన కూడా ఇవి రావచ్చు. ఇలా చాలా మందిని సెగగడ్డలు వేధిస్తుంటాయి. రకరకాల మందులు వాడుంటారు కూడా. అయినప్పటికీ ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. అందుకే ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ సహజ సిద్దంగా సెగ గడ్డల నుంచి ఉపషమనం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
వెల్లుల్లిలోని రోగ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని పేరుకునే చెడు కొవ్వు మోతాదును తగ్గించడానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. చర్మంపై ఎటువంటి వాపునైనా తొలగించడంలో సహాయపడుతాయి. వెల్లుల్లి లో యాంటి ఫంగల్, యాంటి క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందిని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా వెల్లుల్లి వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సెగ గడ్డలు తగ్గడానికి ఈ చిట్కాను పాటించి చూద్దాం… కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ వాము కలిపి మిక్స్ చేసి పెస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సెగ గడ్డలపై పూయాలి. కొంతసేపటి తర్వాత చల్లటి నీటితో కడగాలి. రెగ్యూలర్ గా ఇలా చేయడం వల్ల సెగ గడ్డలు పూర్తిగా తగ్గిపోతాయి.
అలాగే బియ్యం పిండితోనూ సెగ గడ్డలను తగ్గించుకోవచ్చు. బియ్యపు పిండిలో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడిచేసుకోవాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత సెగ గడ్డలపై రాయాలి. తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సెగ గడ్డలు తొందరగా తగ్గిపోతాయి.