Skin : చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… ఈ టిప్స్ పాటించండి…!
ప్రధానాంశాలు:
Skin : చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా... ఈ టిప్స్ పాటించండి...!
Skin : సీజన్ మారినప్పుడు మనకి చర్మంపై దురద అనేది వస్తూ ఉంటుంది. అయితే చాలా మందికి చర్మంపై దురద ఎక్కువగా ఉంటుంది. దీని వలన వారు ఏ పనులు చేసుకోలేరు. ఇది నలుగురిలో ఉన్నప్పుడు వచ్చినట్లయితే మరీ ఇబ్బందిగా కూడా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం డ్రై గా మారడం అని చెప్పాలి. అయితే ఇలాంటి టైం లో కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ దురద అనేది తొందరగా తగ్గుతుంది. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
స్నానం : మనకు దురదగా ఉన్నప్పుడు కొల్లాయిడల్ ఓట్ మిల్ పౌడర్ లేక బేకింగ్ సోడాను కొద్దిగా తీసుకొని దీనిలో కొంచెం పిపర్ మెంట్ ఆయిల్ ను కలుపుకొని స్కిన్ పై అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీని వల్ల రిలీఫ్ అనేది దొరుకుతుంది. అలాగే కొల్లాయిడల్ ఓట్ మిల్ అనగా ఓట్స్ ను మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. మనం దీన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కు ఉపయోగించవచ్చు. ఈ ఓట్స్ లోని ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, పోషకాలు స్కిన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా దూరం చేస్తాయి…
Skin మాయిశ్చరైజర్
మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత మీ ఒళ్ళు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఎటువంటి కెమికల్స్ లేని మరియు హైపో అలర్జనిక్ మాయిశ్చరైజర్ ను వాడాలి. అయితే ఇది చర్మాన్ని డ్రైగా లేకుండా చూస్తుంది. దీని వలన చర్మం పై దురద కూడా తగ్గుతుంది…
ఐస్ మసాజ్ : మీకు మరీ అధికంగా దురద ఉన్నట్లయితే ఐస్ క్యూబ్స్ తో మసాజ్ కూడా చేసుకోవచ్చు. దీని కోసం ఒక క్లాత్ లో ఐస్ క్యూబ్ ను వేసుకొని కోల్డ్ కంప్రెసర్ చేయాలి. ఇలా ఐదు నుండి పది నిమిషాల పాటు అలానే ఉంచితే దురద అనేది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది.
క్రీమ్స్, లోషన్స్ : అలాగే కెమికల్స్ లేని లోషన్స్ మరియు జెల్స్ ను కూడా వాడాలి. అలోవెరా మరియు కెలమైన్ లోషన్, మైంథాల్ ఉన్నటువంటి లోసెన్స్ లాంటి వాటిని వాడితే సమస్య అనేది తగ్గుతుంది. అలాగే కెమికల్స్ ఉన్నటువంటి డబ్బులు మరియు షాంపూలు, డిటర్జెంట్స్ కూడా వాడటం మంచిది కాదు…
బట్టలు : అలాగే చర్మాకి చికాకు పెట్టే బట్టలు కూడా వేసుకోకూడదు. అంతేకాక టైట్ బట్టలు కాక మంచి కాటన్ మరియు లూజుగా ఉంటే బట్టలను వేసుకోవటం ఉత్తమం…
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ : ఈ సమస్య నుండి బయట పడాలంటే మంచి డేట్ ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒమేగా త్రీ ఫుడ్స్ ను కూడా తీసుకోవాలి. అంతేకాక సాల్మన్ చేపలు మరియు ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి తీసుకోవడం వలన ఇన్ ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అలాగే విటమిన్ ఏ ఫుడ్స్ మరియు గుడ్డులోని పచ్చ సోనా మరియు లివర్ మరియు నారింజ పండ్లు,పసుపు పచ్చని కూరగాయలు లాంటివి తీసుకుంటే మరీ మంచిది.
అలర్జీలకి కారణం : చాలాసార్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సమస్యలు అనేవి వస్తాయి. ముందుగా దీనికి అసలు కారణం ఏంటో కనుక్కోవాలి. ఉదాహరణకి మీకు సడన్ గా ఏదైనా తిన్నావంటనే దురద అనేది వస్తూ ఉంటే ఆ ఫుడ్ మీకు పడదు అని అర్థం చేసుకోవాలి. తర్వాత వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది….
డాక్టర్ ను ఎప్పుడు కలవాలి : ఎలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా సమస్య అనేది తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను కలవాల్సి ఉంటుంది. తర్వాత మిమ్మల్ని పరీక్షించినటువంటి డాక్టర్ సమస్యకు కారణం ఏమిటి అనేది తెలుసుకొని మంచి మెడికేషన్ ను ఇస్తారు…