Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!
Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా గుండ్రంగా ఉండేటటువంటి ముద్దలు. అయితే ఇవి ప్రతి ఒక్కరి నోట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే ఇవి నోరు, ముక్కు, గొంతు నుండి ఎటువంటి వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా ట్యాన్సిల్స్ అనేవి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. అయితే ఇవి ఎంతోమందికి జలుబుతో టాన్సిలిటీస్ ఇన్ఫెక్షన్లు అనేవి తలెత్తుతాయి. ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా అరుదుగా వస్తుంది. […]
ప్రధానాంశాలు:
Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు... ఎలాగంటే...!
Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా గుండ్రంగా ఉండేటటువంటి ముద్దలు. అయితే ఇవి ప్రతి ఒక్కరి నోట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే ఇవి నోరు, ముక్కు, గొంతు నుండి ఎటువంటి వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా ట్యాన్సిల్స్ అనేవి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. అయితే ఇవి ఎంతోమందికి జలుబుతో టాన్సిలిటీస్ ఇన్ఫెక్షన్లు అనేవి తలెత్తుతాయి. ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా అరుదుగా వస్తుంది. అయితే దీని నుండి ఎలా బయటపడాలో ఎవరికీ తెలియదు. అయితే ఈ ట్యాన్సిల్స్ నొప్పి ని ఇంటి నివారణతో కూడా తొలగించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం…
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఈ నీటితో మనం ఆవిరి తీసుకోవాలి. అలాగే వాపింగ్ చేసేటప్పుడు చెవులు మరియు తలను ఒక గుడ్డతో కట్టుకోవాలి. దీంతో ట్యాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. అంతేకాక ఛాతిలో పేర్కొన్న శ్లేష్మం కూడా క్లీన్ అవుతుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం మరియు తేనె, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పానీయం అనేది ట్యాన్సిల్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయ నీటిని రోజుకు రెండు లేక మూడు సార్లు తాగినట్లయితే ట్యాన్సిల్స్ నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.
ట్యాన్సిల్స్ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి గ్రీన్ టీ కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకోవాలి. ఇలా రోజు గ్రీన్ టీ మూడుసార్లు తీసుకోవాలి. ఈ గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. ఇది ట్యాన్సిల్స్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అంతేకాక ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని తాగాలి. అయితే ఈ పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ట్యాన్సిల్స్ నొప్పిని మరియు ఇన్ఫెక్షన్ల ను కూడా నియంత్రిస్తుంది. అయితే పసుపు కలిపిన పాలను రోజు తీసుకోవడం వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ట్యాన్సిల్స్ నొప్పితో బాధపడేవారు వెజిటేబుల్ లేక చికెన్ సూప్ ను వేడివేడిగా తీసుకుంటే మేడకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ట్యాన్సిల్స్ నొప్పి కూడా తగ్గుతుంది…