Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా… ఇలా చేస్తే చాలు… తెల్లగా మెరిసిపోతాయ్…!
ప్రధానాంశాలు:
Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా... ఇలా చేస్తే చాలు... తెల్లగా మెరిసిపోతాయ్...!
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన పళ్ళు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అయితే ఈ పసుపు పళ్ళ ను శుభ్రం చేసుకోవడానికి మనం వైద్యులను సంప్రదించవచ్చు. కానీ ప్రతిసారి వైద్యుల వద్దకు వెళ్లి క్లీన్ చేయించుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించడం వలన దంతాల యొక్క పసుపు రంగును ఈజీగా తొలగించుకోవచ్చు. అయితే మనం పాటించవలసిన హోమ్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
మన పసుపు పళ్ళను క్లీన్ చేసుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా వాడవచ్చు. దీనికోసం ఒక కప్పు నీటిలో 2 టేబుల్ స్పూన్ లా ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి మౌత్ వాస్ చేయాలి. దాని తర్వాత ఆ మిశ్రమాన్ని నోటిలో పోసుకొని బ్రష్ చేసి మింగాలి. అయితే మీరు దీనిని ట్రై చేసే ముందు తప్పకుండా ఒకసారి వైద్యులను సంప్రదించండి. ఈ పసుపు పళ్ళ ను క్లీన్ చేసుకోవడానికి మరొక చిట్కా ఏమిటి అంటే, మీరు నిమ్మ మరియు నారింజ, అరటి తొక్కలను కూడా వాడవచ్చు. ఇవి మీ పళ్ళ పై పేర్కొన్న పసుపు ఫలకలను తొలగించటంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. దీనిలో ఉన్న డి లిమోనెన్ లేక సిట్రిక్ యాసిడ్ పై తొక్కలో ఉన్నటువంటి సమ్మేళనం మీ దంతాలను తెల్లగా చేయటంలో హెల్ప్ చేస్తాయి.
అలాగే దంతాలను క్లిన్ చేసేందుకు ఈ తొక్కను మీ దంతాల మీద ఒక రెండు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. అలాగే పసుపును కూడా బ్రష్ పై వేసుకొని రెండు నిమిషాల పాటు బ్రేష్ చేసుకోండి. ఇది కూడా మీ దంతాలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు బ్రష్ ల గురించి కొన్ని విషయాలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అయితే మీరు వాడే టుత్ బ్రష్ ను ప్రతి మూడు నెలలకి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి