Onion : ఉల్లిపాయతో మొటిమలు, నల్ల మచ్చలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా…!
Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉల్లితో ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే కేవలం ఆరోగ్య సమస్యలు మరియు జుట్టు సమస్యలే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఎంతో మందికి ముఖం పై తెల్లని మచ్చలు మరియు నల్ల మచ్చలు మరియు మొటిమల తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటితో […]
ప్రధానాంశాలు:
Onion : ఉల్లిపాయతో మొటిమలు, నల్ల మచ్చలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా...!
Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. అయితే ఈ ఉల్లిపాయతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉల్లితో ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే కేవలం ఆరోగ్య సమస్యలు మరియు జుట్టు సమస్యలే కాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా నియంత్రించవచ్చు. అయితే ఎంతో మందికి ముఖం పై తెల్లని మచ్చలు మరియు నల్ల మచ్చలు మరియు మొటిమల తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటితో మన ముఖాన్ని మనం చూసుకోవాలన్న కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇవి ముఖం యొక్క అందాన్ని తగ్గిస్తాయి. అలాగే వీటిని మేకప్ తో కవర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. దీని వలన ఎంతో మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే క్రీమ్ లను కూడా వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మన ముఖంపై ఉండే మొటిమలు మరియు నల్ల మచ్చలను నియంత్రించేందుకు మన ఇంటిలో ఉండే ఉల్లిపాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ సమస్యలను ఉల్లిపాయతో ఈజీగా తగ్గించుకోవచ్చు. మరీ అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా ఉపయోగించాలంటే : మచ్చలు మరియు మొటిమలు ఇతర చర్మ సమస్యలను తొలగించడానికి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకోవాలి. ఈ ఉల్లిపాయను కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ నుండి రసాన్ని బయటకు తీయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక క్లాత్ లో వేసి పిండితే రసం అనేది బయటికి వస్తుంది. ఈ రసాన్ని మొటిమలు మరియు మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి. దాని తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ముఖానికి బాగా అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా నిత్యం కచ్చితంగా చేస్తే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అయితే వారానికి రెండుసార్లు ఇలా చేయాలి. ఇలా నెల రోజులు చేస్తే మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మచ్చలు మరియు మొటిమలు తగ్గి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.ఈ ఉల్లి రసంలో మీరు శనగపిండి మరియు పసుపు, పెరుగు లాంటి వాటిని కూడా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. అయితే అన్నీ కూడా అందరికీ పడాలి అని లేదు కావున ముందుగా రెండుసార్లు ట్రై చేయండి. ఒకవేళ మీకు అలర్జీ గనక వస్తే వదిలేయండి…