Onion : ఉల్లిపాయను జేబులో పెట్టుకుంటే వడదెబ్బ తగలదా.. నిజమేంటి..?
ప్రధానాంశాలు:
Onion : ఉల్లిపాయను జేబులో పెట్టుకుంటే వడదెబ్బ తగలదా.. నిజమేంటి..?
Onion : ఇప్పుడు ఎండాకాలం నడుస్తోంది. మామూలు ఉష్ణోగ్రతల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ ఎండకు బయటకు వెళ్తే అంతే సంగతి. మార్చి నెల నుంచే ఈ సారి ఎండలు భగ్గుమంటున్నాయి. ఇక ఇప్పుడ ఏప్రిల్ లో అయితే అడుగు బయట పెట్టడానికి కూడా భయపడేపరిస్థితులు వస్తున్నాయి. అందుకే ఈ ఎండలకు ఎవరూ పెద్దగా బయటకు వెళ్లడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే బయట తిరిగితే వడదెబ్బ తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పుదీన, పుల్లటి పెరుగు, పచ్చి ఉల్లిపాయ లాంటివి బాడీని చల్లగా ఉంచుతాయని అంటున్నారు.
Onion : ఎండ నుంచి కాపాడుతుందా..?
అంతే కాకుండా ఉల్లిపాయను జేబులో పెట్టుకుని తిరిగితే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. అసలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఓ సామెత కూడా ఉంది. అవును ఉల్లి పాయ ఎండ నుంచి కూడా కాపాడుతుంది. ఈ మధ్య వడ దెబ్బ తగలకుండా జేబులో ఉల్లిపాయను పెట్టుకుని తిరిగితే వడదెబ్బ తగలకుండా తప్పించుకోవచ్చు అని అందరూ నమ్ముతున్నారు. వాస్తవానకి ఉల్లిపాయను జేబులో పెట్టుకుంటే కచ్చితంగా వడదెబ్బ తగలకుండా ఉంచదని అంటున్నారు. కాకపోతే హీట్ హీట్ స్ట్రోక్ నుంచి పచ్చి ఉల్లి పాయ ఉపశమనం ఇవ్వదు.
కాకపోతే మరీ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు జేబులో పెట్టుకున్న ఉల్లిపాయను తినాలనిపిస్తే తినేయొచ్చు. ఉల్లిపాయలో సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కూడా బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను నిర్వహిస్తాయి. కాబట్టి బాడీ మరీడీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవచ్చు. ఆ విధంగా ఇది ఎండవేడి నుంచి కాపాడటంలో సాయం చేస్తుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వడదెబ్బ తగల కుండా చేయడమే కాదు వడదెబ్బకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఉల్లి పాయను తింటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దాని వల్ల కూడా మనం ఎండ వేడి నుంచి కాపాడుకోవచ్చు. కాబట్టి ఎండలో బయటకు వెళ్లే సమయంలో జేబలో ఉల్లిపాయను పెట్టుకుంటే మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు.