Hair Tips : గంజిలో ఈ రెండు కలిపి తలకి పట్టించారంటే.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది!
Hair Tips : ప్రస్తుత కాలంలో ఉన్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీంతో పాటు జుట్టు పొడవు పెరగడం లేదని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే డాండ్రఫ్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీటి అన్నింటి నుంచి ఉపశమనం అందించడానికి ఒక ఆయుర్వేద రెమిడీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రెమిడీ వల్ల హెయిర్ కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ అవుతుంది. అంతే కాకుండా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఈ రెమిడీ ఎంతగానో సహాయపడుతుంది.
ఇందుకోసం కావాల్సిన పదార్థాల ముఖ్యంగా గంజి. ఇది ప్రతీ ఒక్కరి ఇంట్లో సర్వ సాధారణంగా లభిస్తుంది. ఇది హెయిర్ ను సిల్కీగా చేయడంతో పాటు డాండ్రఫ్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇందులో అనేకమైన పోషకాలు జుట్టుకి బలాన్ని చేకూరుస్తాయి. రెండోది కలోంజి గింజలు. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు తెల్లబడకుండా సంరక్షిస్తాయి. అంతే కాకుండా జుట్టును ధృడంగా చేస్తుంది. మరియు మెంతులు. ఇవి మన తనలు చల్లగా ఉంచుతూ.. డాండ్రఫ్ ను క్లియర్ చేయడానికి సహాయ పడతాయి. ముందుగా ఒక గిన్నెలో గంజిని తీస్కొని అందులో రెండు స్పూన్ల కలోంజి గింజలు వేస్కోవాలి. అలాగే రెండు స్పూన్ల మెంతులు వేస్కొని ఒక గంట సేపు నాననివ్వాలి.

How To Use Rice Water For Hair Growth
ఇలా గంట తర్వాత కలోంజి గింజలు మరియు మెంతులు బాగా నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. వీటిని ఒక గుడ్డ సాయంతో వడకట్టుకోవాలి. వడకట్టగా వచ్చిన గింజలను బాగా పిసుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా గింజల్లోని జిగురు బయటకు వస్తుంది. మరలా ఇందులో కొంచెం గంజి పోస్కొని మరలా వడకట్టుకోవాలి. ఇలా తయారు అయిన గంజిని తలకు కుదుళ్ల నుంచి చిగుళ్ల వరకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒఖ అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో లేదా ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా మన జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది. అంతే కాకుండా హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది.