Health Tips : మగవాళ్లు ఇవి తింటున్నారా.? అయితే పిల్లలు పుట్టడం కష్టమే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మగవాళ్లు ఇవి తింటున్నారా.? అయితే పిల్లలు పుట్టడం కష్టమే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 January 2023,6:00 am

Health Tips : చాలామంది పెళ్లైన జంటలు పిల్లల కోసం ఎంతో ఆరాటం చెందుతూ ఉంటారు.. అయితే కొంతమందికి పెళ్లి అవ్వగానే పిల్లలు పుడుతూ ఉంటారు. కానీ కొంతమందికి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పిల్లలు అసలు పుట్టరు.. వాటికి కారణం మగవారు ఇవి తినడమే అని వైద్య నిపుణులు చెప్తున్నారు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. లేదని ఏది పడితే అది తినడం అలాగే శారీరిక శ్రమ లేకుండా ఉండడం వలన ఎన్నో వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. ప్రధానంగా అధిక బరువు పెరిగిపోవడం, ఉబకాయం, షుగర్, గుండె జబ్బులు లాంటివి వస్తూ ఉంటాయి. వీటికి కారణం మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. దీని కారణంగా మరింత కృంగిపోతుంటారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో యువత సైతం ఇటువంటి అనారోగ్యానికి గురవుతున్నారు.

30 సంవత్సరాల వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే అంతకంటే ప్రమాదకరం ఏంటంటే 30 సంవత్సరాల వయసులోనే లైంగిక శక్తిని కూడా కోల్పోతూ ఉన్నారు. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న కల్తీ జీవనశైలి మూలంగా పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది. దాని కారణంగా పెళ్లి తర్వాత సంతానం కలగక తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుంది. కావున తినే ఆహారంపై జీవించే విధానంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రధానం అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన మగవారిలో వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం… మద్యం : అబ్బాయిలు మద్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

If men eat these is it difficult to have children

If men eat these, is it difficult to have children

ఎక్కువగా మద్యం తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మద్యం వినియోగం సెక్స్ డ్రైవ్ పై గణనీయమైన ప్రభావం పడుతుంది. కంటిన్యూగా ఆల్కహాల్ తీసుకోవడం వలన టెస్ట్ స్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి. కావున కొంచెం జాగ్రత్తలు వహించి మంచి ఆహారాలు తీసుకోవాలి… పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడిన కూరగాయలు : నేరుగా పెస్టిసైడ్స్ తీసుకొని అప్పటికి వాటిని ఎక్కువగా వాడి పండిస్తున్న పంటలను తీసుకోవడం వలన వాటి ప్రభావం మనుషులపై ఎక్కువగా పడుతూ ఉంటుంది. వీటి వలన మనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా ఇది స్పెర్ము కౌంటర్ ని తగ్గిస్తుంది.. ఎక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు : పాలు, క్రీమ్, జున్ను ఎక్కువగా వాడే వారైతే మీ అలవాటులను వెంటనే మార్చుకోవాలి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఫుల్ ప్యాట్ పాలలో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు ఇచ్చే

స్టెరాయిడ్స్ స్పెర్ము నాణ్యతను దెబ్బతినేలా చేస్తాయి. ఫుల్ ఫ్యాటీ డైరీ ప్రొడక్ట్స్ వాడటం మానేసి బాదంపాలు తక్కువ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు.. ట్రాన్స్ ఫ్యాట్స్ : ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2011లో స్పానిష్ అధ్యయనం ప్రకారంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన మగవారిలో స్మెర్ము కౌంటు తగ్గిపోయినట్లు బయటపడింది… ప్రాసెస్ చేసిన మాంసాలు : ప్రాసెస్ చేసిన మాంసాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధులు వస్తాయని తాజాగా అధ్యయనంలో బయటపడింది. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో గొడ్డు, మేక మాంసం, పంది మాంసం ఉంటాయి. ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వలన స్పెర్ము కౌంట్ తగ్గినట్లు తేలుతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది