Diabetes : మధుమేహం ఉన్నవాళ్లు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం దంతాలపై పడుతుంది…!!
Diabetes : ప్రస్తుతం చాలామంది మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. ఈ షుగర్ వ్యాధి ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళ జీవనశైలి కొన్ని ఆహార అలవాట్లపై కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో పడతారని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర లెవెల్స్ తరచుగా పెరుగుతూ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదం అని నిరూపణ చెందింది.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం వలన దంతాలు కూడా దెబ్బతింటాయి. షుగర్ అనేక వ్యాధులకు కారణంగా మారుతుంది.
అలాగే ఇది గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధితో సహా ఎన్నో రకాల సమస్యలను కలిగేలా చేస్తుంది. అందుకే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను పెరగడం వలన ఆ ఎఫెక్ట్ దంతాలపై పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.షుగర్ దంతాలను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది… చిగుళ్ల వ్యాధి : షుగర్ మీ రోగ నిరోధక శక్తిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది చాలా బలహీనంగా మార్చేస్తుంది. దీనివలన మీకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చిగుళ్ల వ్యాధి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో చిగుళ్ళు కుళ్ళిపోవడం మొదలవుతాయి.. క్యావిటీస్ : నోటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ అవి బ్లడ్ లో షుగర్ తో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా చుట్టూ పలకమ్ అని పిలవడే పొరను వేర్పరుస్తూ ఉంటాయి.
ఈ పలకంలో ఒక ప్రత్యేక రకం యాసిడ్ కలిగి ఉంటుంది. ఇది క్రమంగా మీదంతాలను కుళ్ళిపోయేలా చేస్తుంది..షుగర్ వ్యాధిగ్రస్తులు దంత వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవచ్చు.. సిగరెట్, ఆల్కహాల్, శీతల పానీయాలు మీ దంతాలకు హాని చేస్తూ ఉంటాయి. కావున వాటికి దూరంగా ఉంటే మంచిది. సాధారణ దంత వైద్యుల వద్దకు వెళ్లి మీ దంతాలను పరీక్షించుకోండి. అవసరమైతే స్కేలింగ్ కూడా చేయించుకుంటే మంచిది. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది. రెండు దంతాల మధ్య అంటుకున్న మురికిని తొలగించడానికి డెంటల్ క్లాస్ వాడాలి. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు రెండు సార్లు పళ్ళను శుభ్రం చేసుకోవాలి.