విటమిన్ డి ఎక్కువైతే మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తాయి.. అన్ని వ్యాధులకు స్వాగతం పలికినట్లే..!
సహజంగా అందరిలో విటమిన్-డి లోపిస్తూ ఉంటుంది. శరీరంలో విటమిన్ నుండి తగ్గినప్పుడు ఎన్నో వ్యాధులు సంభవిస్తుంటాయి. ఈ విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా మన శరీరానికి అందుతుంది.. విటమిన్ డి మన బాడీలో కరెక్ట్ గా ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. సూర్యరశ్మి నుంచి కాకుండా తినే ఆహారం నుంచి కూడా లభించే ఈ విటమిన్ మన దంతాలు ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సీజనల్ వ్యాధి నుంచి మనల్ని కాపాడుతుంది. విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి ఎక్కువైతే ఎటువంటి వ్యాధులు సంభవిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం..
విటమిన్ డి ఎక్కువైతే వాంతులు, వికారం లాంటి సమస్య భోజనం చేసిన వెంటనే ఈ లక్షణం కనబడితే శరీరంలో విటమిన్ డి అధికంగా ఉందని తెలుసుకోవాలి.. అలాగే ఆకలి లేకపోవడం శరీరంలో విటమిన్ డి ఎక్కువ ఉండడం వల్లే.. క్యాల్షియం శోషణ ను పెంచుతుంది. ఇలా జరిగితే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలు కూడా విటమిన్ డి అధికంగా ఉండడం కారణంగానే ఉంటాయి.. విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
విటమిన్ డి మోతాదు శరీరంలో ఎక్కువైతే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. దాని ఫలితంగా హైపర్ కాలిపోయిన అనే సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అలసట, వాంతులు తరచూ మూత్రవిసర్జన లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
ఈ అధిక విటమిన్ డి సమస్య ను కంట్రోల్ చేయాలంటే ఎక్కువగా సల్మాన్ ఫిష్, గుడ్డు సోనా, సోయా, పాలు లాంటి ఆహారాలను అలాగే పుట్టగొడుగులను తక్కువగా తీసుకుంటూ ఉండాలి..
అలాగే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒకసారి వైద్య నిపుణుని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్లు చేయించుకోవాలి..