Papaya And Banana : బొప్పాయిని,అరటి రెండింటిని కలిపి తింటున్నారా…. అయితే మీకు ఈ వ్యాధులు వచ్చినట్లే ….!
ప్రధానాంశాలు:
Papaya And Banana : బొప్పాయిని,అరటి రెండింటిని కలిపి తింటున్నారా.... అయితే మీకు ఈ వ్యాధులు వచ్చినట్లే ....!
Papaya And Banana : మనము కొన్ని రకాల ఫ్రూట్స్ నీ కలిపి తింటాము. అలా కలిపి తినడం వలన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి కొన్ని రకాల పండ్లను కొన్నిటితో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యం కాదు కదా అనారోగ్యం సమస్యలను తెచ్చిపెడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లలో అరటి పండు బొప్పాయి పండు కూడా ఉన్నాయి. అసలు వాస్తవానికి పండ్లు ప్రతిరోజు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు ఏదో ఒక పూట పండ్లను తినటం వలన ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం కొన్ని రకాల పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్స్ రూపంలో చేసుకుని తింటున్నారు. ఫ్రూట్ సలాడ్స్ రూపంలో తినేవారికి. తప్పక కొన్ని కొన్ని రకాల పండ్లను అందులో లేకుండా చూసుకోవాలి. ఇలాంటివారు కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల పండ్లను కొన్నేటితోకలిపి తినడం వలన పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరి అలాంటి పండ్లలో అరటిపండు బొప్పాయి కూడా ఉన్నాయి.
అన్ని రకాల పండ్లు వాటి స్వంత స్వభావం కలిగి ఉంటాయి. విభిన్న స్వభావం గల రెండు రకాల పండ్లను కలిపి తినడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి అంటున్నారు నిపుణులు. ఆయుర్వేద ప్రకారం అరటి, బొప్పాయి పండు కలిపి తినడం ప్రమాదకరము అంటున్నారు. గుండెకు, పొట్టకు ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి పండును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహానికి మేలు చేస్తుంది బొప్పాయ. ఈ రెండిటిని విడివిడిగా తినటం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఈ రెండిటిని కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ బొప్పాయి మాత్రం శరీరానికి వేడిని కలగజేస్తుంది. కానీ ఈ రెండు పనులను కలిపి ఒకేసారి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు,తల తిరగడం,అలర్జీ, అజీర్ణం, వంటి సమస్యలు రావొచ్చు అంటున్నారు నిపుణులు. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదని చెబుతున్నారు. బొప్పాయి తినడం వలన స్కిన్ ఎలర్జీ వస్తాయి. అంతేకాకుండా మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదని చెబుతున్నారు.