Eye Problems : వీటిని తింటే చాలు.. జీవితాంతం కంటి సమస్యలే రావు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eye Problems : వీటిని తింటే చాలు.. జీవితాంతం కంటి సమస్యలే రావు…!

Eye Problems : ప్రస్తుతం చాలామంది కళ్ళ సమస్యలతో సతమతమవుతున్నారు.. కళ్ళు కనిపించకపోతే ప్రపంచం మొత్తం చీకటిగా అనిపిస్తుంది. మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కళ్ళు కూడా ఒకటి. కంటి ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని పనులను చక్కగా చేసుకోగలం. అయితే ఇటీవలో చాలా మంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. ప్రధానంగా వేసవిలో కళ్ళు పొరపాడటం, చూపు మందగించడం, దురద లాంటి ఇబ్బందులను అన్ని వయసుల వారు లో కనబడుతున్నాయి. అయితే ఈ సమస్యలకు కారణాలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Eye Problems : వీటిని తింటే చాలు.. జీవితాంతం కంటి సమస్యలే రావు...!

Eye Problems : ప్రస్తుతం చాలామంది కళ్ళ సమస్యలతో సతమతమవుతున్నారు.. కళ్ళు కనిపించకపోతే ప్రపంచం మొత్తం చీకటిగా అనిపిస్తుంది. మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కళ్ళు కూడా ఒకటి. కంటి ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని పనులను చక్కగా చేసుకోగలం. అయితే ఇటీవలో చాలా మంది కంటి సమస్యల బారిన పడుతున్నారు. ప్రధానంగా వేసవిలో కళ్ళు పొరపాడటం, చూపు మందగించడం, దురద లాంటి ఇబ్బందులను అన్ని వయసుల వారు లో కనబడుతున్నాయి. అయితే ఈ సమస్యలకు కారణాలు వీటికి ఎలా చెక్ పెట్టాలి ఇప్పుడు మనం చూద్దాం..

కంటి పరిశుభ్రత పాటించకపోతే కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో తిరగడం పర్యావరణ కారణాలవలన స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపడం వలన దురద, కళ్ళు పొడిబారటం లాంటి సమస్యలు వస్తున్నాయి. సహజంగా వయసు పెరిగే కొద్దీ కండిచూపు మందగిస్తుంది. ఈ ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంది. చాలామంది బైక్ రైడింగ్ సమయంలో కళ్ళకు ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోరు. సన్ గ్లాసెస్ లేదా ఇతర ప్రొటెక్టివ్ కళ్లద్దాలు ధరించకుండా నిర్లక్ష్యంగా వెళుతూ ఉంటారు.

దాని ఫలితంగా హానికర ఇవి యూవి కిరణాలు, దుమ్ముదులి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో కళ్ళు పోడి మారడంతో పాటు దురద వస్తున్నాయి.
ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..

Eye Problems : ఆరోగ్యకరమైన డైట్

మనం తినే ఆహారంలో విటమిన్ ఏ, సి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ లాంటి పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. తాజా ఆకుకూరలు, విత్తనాలు, గింజలు, చేపలు లాంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకుంటే కంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఇటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకున్న నిరంతంగా తీవ్రమైన కంటి సమస్యలు వేధిస్తుంటే వెంటనే వైద్యని సంప్రదించడం మంచిది..

Eye Problems వీటిని తింటే చాలు జీవితాంతం కంటి సమస్యలే రావు

Eye Problems : వీటిని తింటే చాలు.. జీవితాంతం కంటి సమస్యలే రావు…!

Eye Problems : కోల్డ్ కంప్రెస్

కనురెప్పలు మూసి వాటిపైన ఐస్ క్యూబ్ తో కోళ్లు కంప్రెస్ చేయడం వలన మంట దురద నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

Eye Problems : హైడ్రేషన్

ఈ సీజన్లో మంచినీరు అధికంగా తీసుకోవాలి. దాంతో శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఫలితంగా కళ్ళలో కన్నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కళ్ళను పొడిబారకుండా చేస్తుంది..

పరిశుభ్రత  :  కళ్ళను ప్రతిరోజు శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో కంటి ఇన్ఫెక్షన్ దురద తగ్గుతాయి. దురదగా ఉంటే అదే పనిగా కళ్ళను రుద్దకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది.

సన్ గ్లాసెస్ ధరించడం

బయటికి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలి. దాంతో హానికరం యూవికిరణాల నుంచి కళ్ళను కాపాడుకోవచ్చు.. దుమ్ముదులి కళ్ళలో చేరదు.. కాబట్టి కళ్ళు పోడి బారాడం, దురద, చికాకు లాంటి సమస్య తగ్గుతుంది.

కంటి వ్యాయామాలు: బ్లింకింగ్ ఎక్ససైజులు రేటినాను ఆక్టివేట్ చేస్తాయి. కన్నీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దాంతో కళ్ళు పొడి వాడటం నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే దృష్టి సమస్యలు తగ్గుతాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది