White Onions : ఈ తెల్ల ఉల్లిపాయలో ఉండే ఉపయోగాలు తెలిస్తే.. ఇప్పుడే వెళ్లి తెచ్చుకుంటారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

White Onions : ఈ తెల్ల ఉల్లిపాయలో ఉండే ఉపయోగాలు తెలిస్తే.. ఇప్పుడే వెళ్లి తెచ్చుకుంటారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,12:00 pm

White Onions : ఉల్లిపాయలు అంటే వంటల్లో అది లేకపోతే వంట మొదలవ్వదు.. ఎ వంట చేయాలన్న మొదట ఉల్లిపాయతోనే మొదలు పెడుతూ ఉంటారు. ఈ ఉల్లిపాయలలో ఎర్ర ఉల్లిపాయ మంచిదా తెల్ల ఉల్లిపాయ మంచిగా దేన్లో ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం.. తెల్ల ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే ముక్కుకు, చెవికి, కంటికి ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ఉల్లిపాయను తీసుకోవడం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. మనకు ఒక సామెత కూడా ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు.

అయితే ఈ ఉల్లి ఒంటికి చలవచేసిందని అంటారు. అటువంటి ఉల్లి రెండు రంగుల్లో మనకి లభిస్తుంది. దాన్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయను వాడుతూ ఉంటారు. కూరగాయల నుండి సలాడ్ల వరకు ప్రతిదాంట్లో ఈ ఎర్ర ఉల్లిపాయను వాడుతూ ఉంటారు. అయితే మీకు తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగాలు గురించి తెలియదు.. ఈ తెల్ల ఉల్లిపాయ వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు ఈ రోజే వెళ్లి కొనక్కొచ్చుకుంటారు. ఎందుకనగా తెల్ల ఉల్లిపాయలు పోషకాలతో నిండి ఉంటాయి. ఈ ఉల్లిపాయలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావంతం చేస్తూ ఉంటాయి.

If you know the uses of this White Onions

If you know the uses of this White Onions

కావున తెల్ల ఉల్లిపాయల వాడకం వలన కలిగే ఉపయోగాలు గురించి ఇక్కడ చూద్దాం… తెల్ల ఉల్లిపాయలు తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్లను నుంచి బయటపడవచ్చు.దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేస్తుంది. ఇంకొక వైపు ఫ్లేవర్ నైట్ సల్ఫర్ ఆంటీ ఆక్సిడెంట్లు ఈ ఉల్లిపాయలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేయడానికి ఈ ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ తీసుకుంటే సగం జబ్బులు తగ్గిపోతాయి.

తెల్ల ఉల్లిపాయలు యాంటీ ఇన్ఫ్లోమేటరీ ఆంటీ కార్డ్స్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తెల్ల ఉల్లిపాయలు మీ జుట్టుకి కూడా చాలా మేలు చేస్తూ ఉంటాయి. ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెల అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నెలపాటు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చలికాలంలో ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం అనే సమస్య ఉంటుంది. దీని వలన చాలామంది మహిళలు బాధపడుతూ ఉంటారు. కాబట్టి తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి అప్లై చేస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. తెల్ల ఉల్లిపాయల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వలన శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోతాయి. దీంతోపాటు తెల్ల ఉల్లిని తీసుకుంటే ఉదర వ్యాధులు కూడా తగ్గిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది