Ink Stains : డ్రస్సులపై పడ్డ ఇంకు మరకలను ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదా… ఈ చిట్కాలు పాటించండి…!
ప్రధానాంశాలు:
Ink Stains : డ్రస్సులపై పడ్డ ఇంకు మరకలను ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదా... ఈ చిట్కాలు పాటించండి...!
Ink Stains : పిల్లలు స్కూల్ కి వెళ్లారంటే చాలు వాళ్ళ డ్రస్ ల మీద ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంకు మరకలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ ఇంకు మరకలు అనేవి తొందరగా వదిలిపోవు. ఈ మరకలను వదిలించుకోవటానికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. కానీ మీరు గనక ఈ చిట్కాలను పాటిస్తే మరకలను ఈజీగా పోగొట్టవచ్చు. ఈ ఇంకు మరకలను పాలతో మీరు ఈజీగా వదిలించుకోవచ్చు. ఎలా అని అంటే పాలలో బ్లీచింగ్ లక్షణాలు అనేవి ఉంటాయి. కావున ఇవి ఇంకు మరకలను తొలగించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. దీని కోసం ఇంకు మరకలు ఉన్న చోట పాలు పోసి బాగా రుద్దండి. అలాగే మరి కొన్ని పాలను పోసి రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే సబ్బుతో రుద్దితే చాలు…
అలాగే మనం ఈ ఇంకు మరకలను ఆల్కహాల్ తో కూడా వదిలించవచ్చు. ఈ ఇంకు మరకలు ఉన్న చోట కొద్దిగా ఆల్కహాల్ వేసి దూదితో వద్దండి. అప్పటికి ఆ మారకలు అనేవి వదలకపోతే కొద్దిగా ఆల్కహాల్ కలిపిన నీటిలో ఒక గంట పాటుగా నానబెట్టి తర్వాత ఉతకాలి. అలాగే ఈ ఇంకు యొక్క మరకలను సేవింగ్ క్రీమ్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు. ఈ సేవింగ్ క్రీమ్ ను ఇంకు మరకలు ఉన్నచోట వేసి బాగా రుద్దండి. దాని తర్వాత సబ్బుతో ఉతికితే ఈజీగా మరకలు అనేవి పోతాయి. ఇది చాలా ఈజీ చిట్కా కూడా.
అలాగే ఉప్పు మరియు నిమ్మరసంతో కలిపి కూడా ఈ మరకలను ఈజీగా తొలగించవచ్చు. అయితే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలుపుకొని టూత్ బ్రష్ తో మరక ఉన్న దగ్గర రుద్దాలి. దాని తర్వాత కొద్దిసేపు సరుపు లో నానబెట్టి తర్వాత సబ్బుతో ఉతికి ఎండలో గనక ఆరేస్తే మరకలు అనేవి ఈజీగా పోతాయి…