గర్భం దాల్చినట్టు ఎలా తెలుసుకోవాలి.. గర్భం వచ్చేముందు కనిపించే ఐదు లక్షణాలు ఇవే..!
Early Pregnancy : ప్రపంచంలోనే ఎవ్వరికీ ఇవ్వని వరాన్ని దేవుడు మహిళకు ఇచ్చాడు. అందుకే.. మహిళలకు మనం అంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలే లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. ప్రతి మహిళ తాను తల్లి కావాలని చాలా కలలు కంటుంది. బిడ్డకు జన్మ ఇవ్వాలని ఆశ పడుతుంది. కానీ.. గర్భం దాల్చడం అనే విషయం దగ్గరికి వచ్చే సరికి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరికైతే ప్రెగ్నెన్సీ వచ్చింది కూడా తెలియదు. అసలు.. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కలిగే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

early pregnancy symptoms telugu health tips
Early Pregnancy : గర్భం దాల్చారని ఇలా తెలుసుకోండి
చాలామందికి పీరియడ్స్ టైమ్ కు రావు. కొందరికి టైమ్ కు పీరియడ్స్ వస్తాయి. టైమ్ కు పీరియడ్స్ వచ్చేవాళ్లు.. ఒక నెల రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. నెలసరి రావడం ఆలస్యం అయిందంటే.. ఓ పది రోజులు ఆగి వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే.. ప్రెగ్నెన్సీ రాగానే.. కొందరికి అస్సలు ఏ వాసన పడదు. ముఖ్యంగా అన్నం, కూరగాయలు అస్సలు పడవు. ఏ కూర తిన్నా కూడా అలాగే.. కక్కేస్తారు. పాలు తాగినా అలాగే వాంతులు చేసుకుంటారు.

early pregnancy symptoms telugu health tips
అండాశయంలో కూడా అప్పుడప్పుడు నొప్పి వస్తుంటుంది. కడుపు నొప్పి రావడం, బ్రెస్ట్ గట్టిపడటం జరుగుతుంది. కొందరికి బ్రెస్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. బ్రెస్ట్ నిపుల్స్ రంగు కూడా మారుతుంది. నిపుల్స్ ను ముట్టుకుంటే చాలు నొప్పి పుడుతుంది. అలాగే.. ప్రతిసారి మూత్రం వస్తుంటుంది. నెలసరి రావడానికి ముందు కొందరికి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. మామూలుగా అది చాలా పలుచగా ఉంటుంది. కానీ.. గర్భవతిగా ఉన్న సమయంలో మాత్రం అది చిక్కగా అవుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగ గర్భం దాల్చినట్టే అని అనుకోవాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. వాళ్ల సలహాలు తీసుకొని.. సరైన మెడికేషన్, రెస్ట్ తీసుకుంటే.. పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చు.

early pregnancy symptoms telugu health tips
ఇది కూడా చదవండి ==> మీరు చేసే ఈ చిన్న పోరపాట్ల వల్లే ఎముకలు బలహినంగా మారుతాయని మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి ==> దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది
ఇది కూడా చదవండి ==> థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఆకును తినాల్సిందే..!
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!