Urination Problem : ఎన్ని నీళ్లు తాగినా యూరిన్ సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవండి..!
Urination Problem : చాలామందికి యూరిన్ సమస్యలు వస్తుంటాయి. కొందరు అయితే.. పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి నిద్రపోయే వరకు.. కనీసం 20 నుంచి 30 సార్లు యూరిన్ కు వెళ్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉండేవాళ్లు అయితే ఎన్నిసార్లు యూరిన్ వచ్చినా సమస్య లేదు కానీ.. ఉద్యోగాలు చేసేవాళ్లు అయితే.. అన్ని సార్లు యూరిన్ కు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తక్కువ నీళ్లు తాగుతారు. తక్కువ నీళ్లు తాగితే తక్కువ యూరిన్ వస్తుందని అలా చేస్తుంటారు.
అయితే.. తక్కువ నీళ్లు తాగితే.. యూరిన్ తక్కువ రావడం పక్కన పెడితే.. ఇన్ఫెక్షన్ వస్తుందది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. తక్కువ నీళ్లు తాగితే.. శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరం వేడెక్కుతుంది. మలంతో పాటు రక్తం పడుతుంది. మల విసర్జన కూడా సరిగ్గా రాదు.. ఇలా చాలా సమస్యలు వస్తుంటాయి.ప్రయాణాలు చేసేవాళ్లు కూడా తక్కువ నీళ్లు తాగుతుంటారు. ఎన్ని నీళ్లు తాగినా.. మూత్రం ఎక్కువగా రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు ఉద్యోగస్తులు అయినా.. ప్రయాణాలు ఎక్కువగా చేసినా.. ఎక్కువగా బయట తిరిగే వాళ్లు అయినా సరే.. ఎక్కువ నీళ్లు తాగినా సరే.. ఎక్కువగా మూత్రం రాకుండా చేయొచ్చు.
Urination Problem : ఎక్కువగా యూరిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
యూరిన్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే.. కొద్ది కొద్దిగా నీళ్లు తాగాలి. ఒకేసారి లీటర్లకు లీటర్లు నీళ్లు తాగకూడదు. కొద్ది కొద్దిగా అంటే.. అరగంటకు ఓ గ్లాస్ వాటర్ అలా.. అంతకు తక్కువ తాగినా ఏం కాదు. అలా కొద్దికొద్దిగా తాగితే.. శరీర అవసరాలకే ఆ నీళ్లు సరిపోతాయి. దాని వల్ల మూత్రం వచ్చే అవకాశం ఉండదు. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా రాదు. మూత్రం వస్తుంది కదా.. అని నీళ్లు తాగకుండా ఎక్కువ సేపు ఉంటే చాలా సమస్యలు వస్తాయి. మీరు ప్రయాణాల్లో ఉన్నా.. వేరే ఏ పనికి బయటికి వెళ్లినా.. ఉద్యోగం చేసేవాళ్లు అయినా.. కొద్దికొద్దిగా నీళ్లను తాగుతూ ఉండండి. దాని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. యూరిన్ కు ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇది కూడా చదవండి ==> మీరు చేసే ఈ చిన్న పోరపాట్ల వల్లే ఎముకలు బలహినంగా మారుతాయని మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి ==> దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది
ఇది కూడా చదవండి ==> థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఆకును తినాల్సిందే..!
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!