Lemon Water : నిమ్మకాయ నీరు ఉదయం పూట తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!
ప్రధానాంశాలు:
Lemon Water : నిమ్మకాయ నీరు ఉదయం పూట తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!
Lemon Water : నిమ్మకాయ నీరు ఒక సహజమైన, శరీరాన్ని రిఫ్రెష్ చేసే పానీయంగా మారిపోయింది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శరీరం నుండి టాక్సిన్స్‌ను తొలగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది బాగా సహాయపడుతుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.

Lemon Water : నిమ్మకాయ నీరు ఉదయం పూట తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!
Lemon Water : ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను కలిపి తాగడం శరీరానికి హైడ్రేషన్‌ను అందించడమే కాకుండా, శక్తి స్థాయులను పెంచుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది, శరీరాన్ని తేజస్సుతో నింపుతుంది. నిమ్మకాయ నీటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగినప్పుడు ఇది శరీరంలో pH స్థాయిని అసమతుల్యం చేయవచ్చు. అధిక ఆమ్లత్వం కారణంగా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే, దంతాల ఎనామెల్‌ను బలహీనపరచి సున్నితత్వాన్ని పెంచే ప్రమాదమూ ఉంది.
గ్యాస్ట్రిక్ అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లాంటి సమస్యలతో బాధపడేవారు, దంతాల సున్నితత్వం లేదా బలహీనమైన ఎనామెల్ ఉన్నవారు, లో బీపీ, మూత్రపిండాల సమస్యలు, ఆమ్లత బాధితులు, అలెర్జీలు ఉన్నవారు ఖాళృ కడుపుతో నిమ్మకాయ నీరు తాగకూడదు. తాగాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. నిమ్మకాయ నీరు తాగేటప్పుడు గోరువెచ్చని నీటిలో సమతుల్యంగా నిమ్మకాయను కలుపుకుని తాగండి.తాగిన వెంటనే నోటిని శుభ్రమైన నీటితో కడగండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య సలహా తీసుకున్న తర్వాతే తాగాలి