Health Tips : బెల్లం vs తేనె ఏది తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి.? ఎందుకనగా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : బెల్లం vs తేనె ఏది తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి.? ఎందుకనగా…!

Health Tips : మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే బెల్లం తీసుకోవడం మంచిదా లేదా తేనె తీసుకోవడం మంచిదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏది మంచిదో ఇప్పుడు మనం చూద్దాం.. చాలామంది డయాబెటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు చక్కెర తీసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. వాళ్లు ఎక్కువగా చక్కెరకు బదులుగా బెల్లం, తేనె లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బెల్లం, తేనెలలో ఏది మంచిది. చక్కెరలో అధిక క్యాలరీలు ఉంటాయి. అధిక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,3:20 pm

Health Tips : మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే బెల్లం తీసుకోవడం మంచిదా లేదా తేనె తీసుకోవడం మంచిదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏది మంచిదో ఇప్పుడు మనం చూద్దాం.. చాలామంది డయాబెటిస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు చక్కెర తీసుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. వాళ్లు ఎక్కువగా చక్కెరకు బదులుగా బెల్లం, తేనె లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బెల్లం, తేనెలలో ఏది మంచిది. చక్కెరలో అధిక క్యాలరీలు ఉంటాయి. అధిక గ్లై సే మిక్ ఇండెక్స్ పదార్థం లాంటి ఇతర అంశాల కారణంగా చక్కెర ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలుపబడింది. జీ1 అనేది రక్తం చక్కెరపై ఒక నిర్దిష్ట రకం ఆహారాన్ని ఇవ్వబడింది. జీ1 ఎంత అధికంగా ఉందో అంత అనారోగ్యమైన ఆహారం లా మారుతుంది. మీరు ఎంత చక్కెర తీసుకుంటే మీ శరీరం ఇన్సులిన్ ప్రతిస్పందన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని అధికమయ్యేలా చేస్తుంది.

అదేవిధంగా రక్తంలో అధిక చెక్కర మీ గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రమాదకరం. కావున మీరు ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్లయితే మీరు ప్రాసెస్ చేసిన చక్కెరను ఉపయోగించకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ ప్రభావం పడుతుంది. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అనేక జబ్బులకు దారితీస్తుంది. కావున చాలామంది చెక్కరకి బదులుగా బెల్లం తేనె లాంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటూ ఉంటారు. ఈ తేనె బెల్లం 2 ఆరోగ్యకరమైనవే. సహజమైన తీపిని కలిగి ఉంటాయి. అయినప్పటికీ బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యకరమైనవి అనే అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. తేనె బెల్లం నడుమ ఉత్తమమైనది ఏదో ఇక్కడ చూద్దాం…

Jaggery vs Honey Which is better for health

Jaggery vs Honey Which is better for health

ఆరోగ్యానికి ఏది శ్రేయస్కరం.. బెల్లం, తేనె రెండు రక్తంలో చక్కెరను పెంచుతూ ఉంటాయి. అయితే సూక్ష్మ పోషకాలు ఉన్నందున బెల్లం, తేనె తీసుకోవడం మంచిది. బెల్లంలో ఎక్కువగా మెగ్నీషియం, కాపర్, ఐరన్ అధికంగా ఉంటే తేనెలో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బెల్లం కంటే తేనే ఉత్తమమని తెలియజేస్తున్నారు. వైద్య నిపుణులు. చాలా రకాల వ్యాధులలో తేనెను ఉపయోగించాలని చెప్తున్నారు. అయితే పరిమితంగానే తీసుకోవాలంటున్నారు. ఎందుకనగా ఎక్కువ తేనె, బెల్లం తీపి కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు..

తేనె ,బెల్లం ఎందుకు తీసుకోవాలి.? తేనే, బెల్లంలో ఐరన్, భాస్వరం, క్యాల్షియం లాంటి కణజాలు ఉంటాయి. బెల్లం చెరుకు రసం నుండి తయారవుతుంది. చక్కెర వలె ప్రాసెస్ చేయకూడదు. అలాగే తేన కూడా సహజమైన ఉత్పత్తి. ఎటువంటి కల్తీని కలిగి ఉండదు. దాని వలన మీ శరీరాన్ని కూడా మంచి జరుగుతుంది. మీరు తీపి కోసం తేనె, బెల్లాన్ని ఉపయోగించవచ్చు. వాటిలో ఉన్న తీపిదనం ఒకేలాగా ఉంటుంది. అయితే పరిమితంగా తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది