Joint Pains : ఈ నూనెలో కర్పూరం కలిపి మోకాళ్ళకు రాస్తే నొప్పులు, వాపులు ఖర్చు లేకుండా తగ్గుతాయి ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Joint Pains : ఈ నూనెలో కర్పూరం కలిపి మోకాళ్ళకు రాస్తే నొప్పులు, వాపులు ఖర్చు లేకుండా తగ్గుతాయి ..!!

Joint Pains : మార్కెట్లో అనేక రకాల నూనెలు దొరుకుతాయి. వాటిల్లో కొన్ని నూనెలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటే యూకలిప్టస్ ఆయిల్. ఈ నూనె వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ యూకలిప్టస్ ఆయిల్ ను నీలగిరి తైలం అని కూడా పిలుస్తారు. చలికాలంలో జలుబు విరుగుడుకు ఈ నీలగిరి తైలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగించిన నీళ్లలో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆవిరి పడితే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 April 2023,5:00 pm

Joint Pains : మార్కెట్లో అనేక రకాల నూనెలు దొరుకుతాయి. వాటిల్లో కొన్ని నూనెలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటే యూకలిప్టస్ ఆయిల్. ఈ నూనె వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ యూకలిప్టస్ ఆయిల్ ను నీలగిరి తైలం అని కూడా పిలుస్తారు. చలికాలంలో జలుబు విరుగుడుకు ఈ నీలగిరి తైలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగించిన నీళ్లలో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆవిరి పడితే ఎంతటి జలుబు అయినా సరే నయం అవుతుంది. అలాగే దగ్గు, ముక్కుదిబ్బడ, ఫ్లూ జ్వరం ఇలాంటి శ్వాసకోశ సమస్యలు కూడా నయం అవుతాయి.

health benefits and Joint pains and joint pains in back pain uses of carom seeds

health benefits and Joint pains and joint pains in back pain uses of carom seeds

ఎటువంటి ఖర్చు లేకుండా ఈ నీలగిరి తైలంతో ఈజీగా జలుబు దగ్గు సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీరంలో నొప్పులు ఉన్నచోట నీలగిరి తైలం రాసి ఆ భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో వెంటనే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వలన కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి నోట్లో వేసుకొని పుక్కిలించాలి. రోజు ఇలా చేయడం వలన నోటి దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుర్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఈ నూనెను నుదిటి మీద ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుంటే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.

Joint Pains Treatment in Telugu in video

Joint Pains Treatment in Telugu in video

వడదెబ్బ తగిలిన వారు తొందరగా కోలుకునేలా చేసే లక్షణాలు ఈ నూనెలో ఉంటాయి. అలాగే చర్మం పొడిబారినప్పుడు ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ఆయిల్ ని నేరుగా చర్మంపై అప్లై చేయకుండా ప్రతిరోజు వాడే కొబ్బరి నూనెలో కొంచెం మోతాదులో నీలగిరి తైలం తీసుకొని రెండింటిని బాగా కలిపి ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ రాస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. చర్మం నున్నగా తయారవుతుంది. ఈ ఆయిల్ ను డైరెక్ట్ గా నోట్లో అస్సలు వేసుకోకూడదు. రెండు లేదా 3ml వేసుకుంటే మగతా, మైకం వస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి దీనిని మితంగా వాడుకోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది