Health Problems : సమ్మర్ లో ఇలా మాత్రం చేయకండి.. ఇది తాగితే చాలా డేంజర్..
Health Problems : ఒంట్లో నీళ్లతో పాటు ఓపికనూ పీల్చేసే సీజన్ ఇది. ఠారెత్తించే ఎండ. తట్టుకోలేని వేడి. భరించలేనంత ఉక్కబోత. చెప్పలేనంత నీరసం. వీటన్నింటి నుంచి గట్టెక్కాలంటే సరైన కేర్ తీసుకోవాల్సిందే. ఇంట్లోంచీ కాలు బయటపెట్టలేం. వేసవిలో వేడి, ఉక్కపోత ప్రమాదకరమైనవి. మన శరీరంలోని ఎనర్జీ, నీటిని అవి లాగేస్తాయి. అందువల్ల మనం నీరసించిపోతాం. సోడియం ఎక్కువగా బయటకి వెళ్లి పోతుంది. అలా జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.ఈ సీజన్‌లో బయట టెంపరేచర్‌తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడే ఎండదెబ్బ తగులుతుంది. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకూ పెరిగిపోతుంది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదని సూచిస్తారు. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలువ చేసే ఫుడ్ ఎక్కువగా తినాలి. నిల్వ పచ్చళ్లు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరేచనాలు, సెగ గడ్డలు వస్తాయి. అలాంటప్పుడు బాడీలో వేడిని తగ్గించే ఫుడ్ తినాలి.వేసవి తాపాన్ని తీర్చేవి కచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించింది మరొకటి లేదు. గంటగంటకూ నీళ్లు తాగాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తియ్యదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫీషియల్ జ్యూస్‌లూ తాగకూడదు.
Health Benefits : వాటర్ ఎక్కువగా తీసుకోవాలి
టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు. పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్, చక్కెర ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే, వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్సే ఎక్కువగా తాగాలి. లేదంటే డీ హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మ రసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగాలి. శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కానివ్వొద్దు. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి.