Kiwi fruit : మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే రోజుకు ఒక కివి తింటే చాలు.. ఎలా తినాలో తెలుసా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kiwi fruit : మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే రోజుకు ఒక కివి తింటే చాలు.. ఎలా తినాలో తెలుసా.?

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kiwi fruit : మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.? అయితే రోజుకు ఒక కివి తింటే చాలు.. ఎలా తినాలో తెలుసా.?

  •  Kiwi fruit : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. పండ్లలో పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లలో ప్రత్యేక పోషకాలు ఉంటాయి.

  •  మీ ఆరోగ్యాన్ని ఇది రక్షిస్తుంది. మీరు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు.

Kiwi fruit : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. పండ్లలో పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లలో ప్రత్యేక పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో కివి ఒకటి. ఈ పుల్లని తీపి పండు ప్రజాదారణ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పండు అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దీనిని తొక్కతో లేదా తొక్క లేకుండా కూడా తీసుకోవచ్చు. ప్రజలు ఈ పండుని అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అయితే దీన్ని తినడం వల్ల చాలా వ్యాధులు తగ్గుతాయని చాలామందికి తెలియదు. కివి తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కివిని ఎలా తినాలో మనం ఇప్పుడు చూద్దాం..

పోషకాలు అధికంగా ఉండే కివిలో ఫైబర్, విటమిన్ సి, పోలిక్, యాసిడ్, పొటాషియం, పాలి పెనాల్స్, విటమిన్ అధికంగా ఉన్నాయి. కివిలో చాలా తక్కువ క్యాలరీలు కూడా ఉంటాయి. కావున ఈ పండు బరువు తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కివి కంటి చూపులు పెంచుతుంది. కివి తింటే కంటిచూపు మెరుగవుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజు రెండు మూడు కివిలను తీసుకోండి. నిజానికి కివి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో చాలా సహాయంగా ఉంటుంది. కడుపుని శుభ్రపరిచే గుణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అయితే ఇన్ని లాభాలు కలిగిన కివి పండు ఎప్పుడు తీసుకోవాలో చాలామందికి తెలియదు. మీరు కూడా కివి తినాలనుకుంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం కాకుండా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో తీసుకోవాలి. నిజానికి కివిలో పోషకాలు అధికంగా ఉన్నాయి.

మీ ఆరోగ్యాన్ని ఇది రక్షిస్తుంది. మీరు ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పండ్లు తీసుకోవడం వల్ల ఎస్డిటి సమస్య వస్తుంది. కావున మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత ఈ కివి పండుని తీసుకోవచ్చు.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లు సీజనల్ వ్యాధులు త్వరగా వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఒక నిరోధక శక్తిని పెంచడానికి టీవీని తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ సి మీ బలహీనమైన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కావున కివిని తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు పోవడంతో పాటు చర్మానికి నిగారింపు కూడా ఇస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది