Health Tips : వాసన చూస్తే చాలూ.. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది.. ఇంకా చాలా ప్రయోజనాలు..
Health Tips : పుదీనా ఆకులను వంటకాల్లో విరివిగా వాడతారు. ఇది అందించే రుచి అమోఘంగా ఉంటుంది. కూరలు సువాసన వెదజల్లాలన్నా అందులో పుదీనా వేయడం తప్పనిసరి. పుదీనా కూరలకు సువాసన, మధురమైన రుచి ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా నుండి తీసిన నూనె పిప్పరమింట్ ఆయిల్ వల్ల ఎన్నో శ్వాస సంబంధ ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక మంది చేసిన పరిశోధనల్లో […]
Health Tips : పుదీనా ఆకులను వంటకాల్లో విరివిగా వాడతారు. ఇది అందించే రుచి అమోఘంగా ఉంటుంది. కూరలు సువాసన వెదజల్లాలన్నా అందులో పుదీనా వేయడం తప్పనిసరి. పుదీనా కూరలకు సువాసన, మధురమైన రుచి ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా నుండి తీసిన నూనె పిప్పరమింట్ ఆయిల్ వల్ల ఎన్నో శ్వాస సంబంధ ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక మంది చేసిన పరిశోధనల్లో తేలింది.
సాంప్రదాయ మూలికా విధానంలో, వైద్యులు పిప్రమెంటును వాడేవారు. ఇది సూక్ష్మ క్రిములను చంపుతుంది. దురద ఆపడంలోనూ ఈ ఆయిల్ ఎంతో సాయం చేస్తుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి కూడా పిప్రమెంటు ఆయిల్ ఉపశమనం కలిగిస్తుంది. వాంతి వచ్చినట్లుండే ఫీలింగ్ ను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్న శ్లేష్మం పూర్తిగా తీసివేయడానికి కూడా సాయం చేస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
అపానవాయువును తగ్గడానికి, చెమటను ప్రోత్సహించడానికి పిప్పరమెంటు ఆయిల్ ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను పెంచడంలో, సహాయపడుతుంది. ఈ విషయాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది.
పుదీనాతో తయారు చేసిన పిప్రమెంటు ఆయిల్ పై చాలా పరిశోధనలు జరిగాయి. జీర్ణ పరిస్థితులపై, ముఖ్యంగా ప్రకోప ప్రేగు సిండ్రోమ్-IBSపై అది మంచి ప్రభావాన్ని చూపుతోందని ఆ పరిశోధనలు తేల్చాయి. NCCIH సోర్స్ ప్రకారం ఎంటర్టిక్-కోటెడ్, డైల్యూటెడ్ పిప్పరమెంట్ ఆయిల్ IBS యొక్క లక్షణాలను తగ్గించగలదని సూచించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.
పిప్పరమెంటు ఆయిల్ లో ఉండే మెంథాల్, పేగు పొర అంతటా కాల్షియం కదలికలను నిరోధించడం ద్వారా పొత్తి కడుపు నొప్పులను తగ్గించగలదని పరిశోధకులు విశ్వసిస్తారు. అజీర్ణం నుండి ఉప శమనం కలిగిస్తుంది. అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ ట్రస్టెడ్ సోర్స్ అనే జర్నల్ లోని ఒక సమీక్షలో చెప్పారు. ప్లేసిబోతో పోల్చినప్పుడు ఎంటర్ టిక్- కోటెడ్ పిప్పర్ మెంట్ ఆయిల్ మరియు కారవే ఆయిల్ కలయిక పెద్ద వారిలో అజీర్తిని తగ్గిస్తుందని తేలింది.
పిప్పరమెంటు నూనె వికారం తగ్గుతుందని నిరూపించడానకి తగిన ఆధారాలు లేవని NCCIH కు చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పిప్పరమెంటు ఆయిల్ ఆవిరిని పీల్చడం ద్వారా గుండె శస్త్రి చికిత్స నుండి కోలుకుంటున్న వ్యక్తుల్లో వికారం, వాంతులు యొక్క ఫ్రీక్వెన్సీ, వ్యవధి అలాగే తీవ్రత తగ్గుతుందని కనుగొన్నారు.