Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలియని నిజాలు… తప్పక తెలుసుకోండి…!
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో సులువుగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టు ఆకులు పొడవుగా సన్నగా పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక ఈ చెట్టు ఎక్కడైనా సులువుగా పెరుగుతుంది. నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టుకి” సూసైడ్ ప్లాంట్ ” అనే పేరు కూడా […]
ప్రధానాంశాలు:
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలియని నిజాలు... తప్పక తెలుసుకోండి...!
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో సులువుగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టు ఆకులు పొడవుగా సన్నగా పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక ఈ చెట్టు ఎక్కడైనా సులువుగా పెరుగుతుంది. నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు వేగంగా పెరుగుతుంది. అయితే ఈ చెట్టుకి” సూసైడ్ ప్లాంట్ ” అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు నుండి వచ్చే గింజలను గన్నేరు పప్పు అని అంటారు. ఈ గింజలను తినడం వలన అపస్మరక స్థితిలోకి వెళ్తారు. అంతేకాదు కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. అలాగే ఈ చెట్టు గింజలలో విషం ఉండడం వలన అది హృదయ స్పందనలపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఈ పచ్చ గన్నేరు గింజలను తిని బతికిన వారికి భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్…
పచ్చ గన్నేరు చెట్టు మాత్రమే కాకుండా దాని నుండి వచ్చే పాలు విషపూరితమైనవి. అందుకే ఇంట్లో ఈ మొక్కను అస్సలు పెంచకూడదు అంటారు. ఎందుకంటే ఆ చెట్టు గాలి సోకిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ చెట్టుకు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. అలాగే గన్నేరు చెట్టు విషపూరితమైనప్పటికీ ఈ చెట్టులో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఔషధాలను బాహ్య శరీరంపై మాత్రమే కాకుండా చెట్టు నుండి తయారు చేసే కషాయాలను రసాయాలను కూడా ఉపయోగిస్తారు. అయితే దీనిని కడుపులోకి ఎట్టి పరిస్థితులను తీసుకోకూడదు.
ఇక పచ్చ గన్నేరు చెట్టులో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దీనిని ఆయుర్వేద నిప్పునుల సహాయంతో లేదా దీని గురించి బాగా తెలిసిన వారి సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి. తెలియని వారు ఈ చెట్టు ఔషధం ఉపయోగిస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా సమస్థ జీవరాశిలో ఎన్నో మొక్కలు జంతువులు మేలు చేస్తే కొన్ని మాత్రం ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి చూడడానికి బాగుంది కదా అని దానిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అది మీ ప్రాణాలనే తీసేస్తుంది. Must know these things about Pacha Ganneru Pappu