Health Benefits : పచ్చ గన్నేరు చెట్టు ప్రయోజనాలు తెలుసా.. కానీ ఈ గింజలను తింటే ఇక అంతేనట.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : పచ్చ గన్నేరు చెట్టు ప్రయోజనాలు తెలుసా.. కానీ ఈ గింజలను తింటే ఇక అంతేనట..

 Authored By mallesh | The Telugu News | Updated on :24 May 2022,3:00 pm

Health Benefits : పచ్చగన్నేరు.. ఈ చెట్టు ఒక ఆయుర్వేద ఔషధం వంటిది. ఈ చెట్టులో అనేక రకాలుగా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అన్ని రకాల విషాలు కూడా ఈ చెట్టులో ఉంటాయి. అందుకోసమే ఈ చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తారు. ఈ చెట్టును ఇంటి పెరట్లో పెంచుకోకపోవడమే చాలా మంచిదని అనేక మంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కానీ వీటికి పూసే పూలు మాత్రం చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.

వీటిని చూసిన వారు ఇట్టే వాటికి ఆకర్షితులవుతారు. అందుకోసమే అనేక మంది ఈ చెట్లను పెంచుకుంటారు. కానీ ఈ చెట్ల గురించి నిజాలు తెలిసిన వారు మాత్రం ఈ చెట్ల జోలికి అస్సలుకే పోరు. గన్నేరు చెట్లలో మనకు అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఈ పచ్చ గన్నేరు చెట్టు ఒకటి. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే..మరో భయంకరమైన విషయం ఏంటంటే ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా కూడా విషతుల్యమేనట. అందుకోసమే ఈ చెట్టును పెంచుకునేందుకు చాలా మంది వెనకడుగు వేస్తుంటారు.

Health Benefits of Pacha Ganneru Chettu

Health Benefits of Pacha Ganneru Chettu

Health Benefits : గాలి పీల్చినా అంతేనట..

ఇక ఈ చెట్టుకు కాసే కాయల నుంచి వచ్చే పప్పునే గన్నేరు పప్పు అని అంటారు. గన్నేరు పప్పు ఎంత విషతుల్యమో మనలో చాలా మందికి తెలుసు. ఎవరైనా ఈ గన్నేరు పప్పును కనుక తింటే ఇక అంతే సంగతులనే విషయాన్ని ప్రతి ఒక్కరూ చెబుతారు. ఈ చెట్టు వలన ఎన్నో ఔషధ ప్రయోజనాలు కూడా కలుగుతాయట. ఈ చెట్టు నుంచి తీసిన కషాయాలతో చాలా ప్రయోజనాలు ఉంటాయట. కానీ ఈ చెట్టు కషాయాలను బాహ్య శరీరం మీద తప్ప శరీరం లోపలికి పంపించకూడదని వైద్యులు చెబుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది