New Virus : ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్… దీని లక్షణాలు ఏమిటి… ఎలా రక్షించుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Virus : ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్… దీని లక్షణాలు ఏమిటి… ఎలా రక్షించుకోవాలి…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,10:00 am

New Virus : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు సంభవించి ప్రజలను ఎంతో భయపెడుతున్నాయి. అయితే నాలుగు సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదు. ఈ కోవిడ్ అనేది రకరకాల వేరియంట్స్ తో ఒకవైపు భయపెడుతుంటే, మరొకవైపు మన దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎంతో పెరుగుతున్నాయి. ఇంతలో నేను కూడా ఉన్న అంటూ వెస్ట్ నైల్ వైరస్ అనేది ఒక కొత్త ముప్పును ప్రజలకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ లో ఈ వైరస్ కేసులు ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ వైరస్ వలన గత కొద్ది రోజులలో 15 మంది రోగులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే. ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ప్రస్తుతం మనమున్న ఈ పరిస్థితులలో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్లో విజృంభిస్తున్న ఈ వ్యాధి అనేది క్రమ క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ వెస్ట్ నైల్ వైరస్ అంటే ఏమిటి. ఇది ఎలా విజృంభిస్తుంది. దీనిని ఎలా తగ్గించవచ్చు. దీని గురించి నిపుణులు చెప్పినటువంటి సలహాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

New Virus ఇజ్రాయేల్ లో వెస్ట్ నైల్ వైరస్ కలకలం

ఇజ్రాయేల్ లో ఉన్న ఎన్నో నగరాల్లో ఈ వేస్ట్ నైల్ జ్వరం వస్తుంది. అయితే మే నుండి ఈ వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య అనేది 300 వరకు చేరింది. దీనిలో 15 మంది రోగులు మరణించగా,20 మంది రోగుల పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇజ్రాయేల్ లో పెరుగుతున్నటువంటి ఈ వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య శాఖ ఎంతో అప్రమత్తంగా ఉంది. దీనిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది…

New Virus ఈ ప్రాణాంతక వైరస్ ఎలా వ్యాపిస్తుంది అంటే

యశోద హాస్పిటల్ కౌశాంబి సీరియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఛావీ గుప్తా మాట్లాడుతూ, ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేది ఎక్కువగా పక్షులలో కనిపిస్తుంది అన్నారు. ఈ వైరస్ సోకినటువంటి జంతువులకు దోమ కుట్టినప్పుడు,ఈ వైరస్ అనేది దోమలోకి వెళ్తుంది. ఈ దోమలు అనేవి మనుషులను కుట్టినప్పుడు, ఆ వైరస్ అనేది మనుషులకు కూడా సోకుతుంది. ఇలాంటి లక్షణాలు ఈ వైరస్ సంక్రమణ తర్వాత కనిపిస్తాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఈ వైరస్ కు సంబంధించిన కేసులు ప్రతి సంవత్సరం తెలుగులోకి వస్తున్నాయి.అయితే ఈసారి మాత్రం ఇజ్రాయేల్ లో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. అంతేకాక ఎంతో ప్రాణాంతకంగా మారింది. ఇటువంటి పరిస్థితులలో ఈ వైరస్ వేరే దేశాలకు కూడా విజృంభించే అవకాశం ఉన్నది.ఈ తరుణంలో ఎంతో రక్షణ అవసరం. అయితే ఈ జ్వరం యొక్క లక్షణాలు మరియు నివారణ మార్గాలపై ప్రజలకు ఎంతో అవగాహన కల్పించాలని డాక్టర్ ఛావీ గుప్తా తెలిపారు…

New Virus వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు

-అధిక జ్వరం.
-తీవ్రమైన తలనొప్పి.
– బలహీనంగా అనిపించటం.
– తీవ్రంగా కీళ్లు మరియు కండరాలలో నొప్పి.
-చర్మంపై దద్దుర్లు.

New Virus ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్ దీని లక్షణాలు ఏమిటి ఎలా రక్షించుకోవాలి

New Virus : ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్… దీని లక్షణాలు ఏమిటి… ఎలా రక్షించుకోవాలి…!

New Virus ఈ వైరస్ నుండి ఎలా రక్షించుకోవాలంటే

– దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు ఎంతో రక్షించుకోవాలి. వాటిని ఇంట్లో కి రాకుండా ఎన్నో చర్యలు తీసుకోవాలి.
– పొడవు చేతులు ఉన్నటువంటి దుస్తులు మరియు కాళ్లు కూడా కనపడకుండా పొడవైన ప్యాంట్ లాంటిది ధరించాలి.
– సాయంత్రం టైంలో వీలైనంతవరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.
– ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకి అస్సలు వెళ్ళకూడదు.
– కిటికీలు మరియు తలుపులకు తేరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది