Health Benefits : జామపండులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. కానీ వీరు ఎక్కువ తీసుకుంటే ప్రమాదమే..
Health Benefits : జామ పండ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి.పేదవాడి ఆపిల్‌గా పేరుగాంచిన పండు జామ. రుచిలో అమోఘంగా ఉండి ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండు జామ. సీజన్‌తో పనిలేకుండా సంవత్సరం పొడవునా దొరికే ఈ పండును ప్రతి రోజూ తీసుకున్నా ప్రయోజనమే. మలబద్దకంతో బాధపడే వారు పండిన జామకాయను తింటే జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దక బాధను తొలగిస్తుంది. జామ పండుతో పాటు ఆకులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.జామపండు, ఆకు రసం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి జామ పండు మేలు చేస్తుంది.
జామకాయలు గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. జామ ఆకుల్లో అధిక స్థాయిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఫ్రీ రాడికల్స్ హృదయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. జామలో అధిక స్థాయిలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది.జామ ఆకు రసం రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది. చాలామంది మహిళలు రుతుస్రావ నొప్పి, తిమ్మిరులు వంటి వాటితో బాధపడుతుంటారు. జామ ఆకు రసం నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. జామకాయలు బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారం. జామ సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. జామలో ఉన్న విటమిన్ సి అంటువ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

people who should be careful about eating guava
Health Benefits : వీరు తక్కువ తింటే మంచిది..
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం త్వరగా ముడుతలు పడకుండా కాపాడుతుంది.జామలో ఎన్నో ఆరోగ్య కర ప్రయోజనాలున్నప్పటికి ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… కడుపు ఉబ్బరం ఉన్న వాళ్లు తక్కువ తీసుకుంటే మంచిది. ఇందులో సీ విటమిన్ పుష్కలంగా ఉండటం చేత కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. అలాగే జామ అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రేగు సిండ్రోమ్ తో భాదపడేవారు మితంగా తీసుకోవాలి.డయాబెటిస్ పెషెంట్స్ కి జామ మంచిదే అయినప్పటికి మితంగా తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. జలుబు మరియు దగ్గు ఉన్న వారు అధికంగా తీసుకుంటే కఫం పెరిగి సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పంటి నొప్పితో భాదపడేవారు కూడా జమకు దూరంగా ఉండాలి. లేదా బాగా పండిన జామను తీసుకోవాలి.