Raw Banana : పచ్చిదే కదా అని తేలిగ్గా తీసేయకండి… ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!!
Raw Banana : అరటిపండు అనేది చాలా పోషకమైన పండు అని చెప్పొచ్చు. అందుకే దీనిని ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయని వైద్యులు తరచూ చెబుతూ ఉంటారు. అలాగే మీరు అరటిపండ్లు కొనడానికి చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మనకు అందుబాటు ధరల్లోనే రకరకాల అరటి పండ్లు ఈజీగా దొరుకుతాయి. ఒక పండిన అరటి పండులో 22 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే డైటరీ మరియు ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, […]
ప్రధానాంశాలు:
Raw Banana : పచ్చిదే కదా అని తేలిగ్గా తీసేయకండి... ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదిలిపెట్టరు...!!
Raw Banana : అరటిపండు అనేది చాలా పోషకమైన పండు అని చెప్పొచ్చు. అందుకే దీనిని ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయని వైద్యులు తరచూ చెబుతూ ఉంటారు. అలాగే మీరు అరటిపండ్లు కొనడానికి చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మనకు అందుబాటు ధరల్లోనే రకరకాల అరటి పండ్లు ఈజీగా దొరుకుతాయి. ఒక పండిన అరటి పండులో 22 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే డైటరీ మరియు ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి-6 కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే పచ్చి అరటి పండులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి అని వైద్యులు అంటున్నారు. అరటి పండ్లను నిత్యం ఖచ్చితంగా తినడం వలన గుండె ఆరోగ్యంతో పాటుగా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు అంటున్నారు…
పచ్చి అరటి పండ్లు పసుపు అరటిపండ్ల కంటే చాలా తక్కువ చక్కెరను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ తీపిని కలిగి ఉంటాయి. అలాగే పచ్చి అరటి పండ్లలో రెసిస్టెన్స్ స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ పచ్చి అరటి పండ్లు దాదాపుగా 30 గ్లైసోమిక్ రుచికాలను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే పచ్చి అరటి పండులో ఫ్రీబయోటిక్ ప్రభావం కలిగి ఉండే బౌండ్ ఫీనోలిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియాను మన కడుపుకు మరియు చిన్న పేగులను చేరుకునేందుకు, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది.
పచ్చి అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. దీంతో క్యాన్సర్ మరియు ఆక్సీకరణ నష్టం లాంటి వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాక మనలో ఎంతోమంది బరువు తగ్గటానికి ప్రయత్నిస్తారు. అయితే డైటింగ్ మరియు జీమ్ లలో ఎంతో చెమటోడ్చినప్పటికీ కూడా వాటిలో విజయవంతం కాలేకపోతారు. ఇలాంటి పరిస్థితులలో మీరు పచ్చి అరటిపండును తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. దీంతో మీకు చాలా తక్కువ కేలరీలు కూడా దొరుకుతాయి. ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీంతో మీరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇలా చేయటం వలన మీరు క్రమంగా బరువు తగ్గుతారు