Health Tips : ఈ ఉప్పు తీసుకుంటే.. బిపి, కీళ్ల నొప్పులు కు చెక్ పెట్టవచ్చు..!!
Health Tips : ప్రస్తుత కాలంలో వయసు తరహా లేకుండా ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు చాలామందిలో బిపీ, కీళ్ల నొప్పులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉప్పు తీసుకుంటే ఈ వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. నిపుణులు తెలియజేస్తున్నారు.. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు లేకపోతే అసలు తినలేం ఇక తినే ఆహారంలో ఉప్పు ఉండే దానిని రుచి రెట్టింపు ఉంటుంది. అయితే మనం తీసుకునే ఉప్పు శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. అతిగా లేదా తక్కువ ఉప్పు తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఉప్పుని కేవలం తగిన మోతాలో వాడితే శరీరానికి అయోడిన్ ఇంకా ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. బ్రెయిన్ పనితీరును మెరుగుపరచడమే కాక చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది.
ఆధునిక జీవనశైలి ఆహారపాలవాట్లు మూలంగా చాలామంది హై బీపీ, కిడ్నీ సమస్యలు అలాగే గుండె సమస్యలు తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు ఉప్పు అతిగా తీసుకోవడం వలన ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ ఉప్పుకి బదులుగా నల్ల ఉప్పుని తీసుకుంటే శరీరానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కల్లుప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… గొంతు నొప్పి : ఆయుర్వేదంలో రాక్ సాల్ట్ కు చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది తీవ్ర గొంతు నొప్పి వచ్చినప్పుడు చిటికెడు వాము, ఉప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తొక్కలించడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు..
అలాగే సీజనల్ వ్యాధుల నుంచి ఈజీగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు : రాళ్ల ఉప్పులో ఉండే మినరల్స్ కీళ్లనొప్పి తిమ్మరి నుంచి బయటపడేస్తుంది. అలాగే కాళ్లు దృఢంగా ఉంచడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ : గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి రాళ్ల ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనిలో ఉండే లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా గుండెపోటు సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. నిత్యం ఆహారంలో రాక్ సాల్టును వాడటం వలన బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. జీయర్ణ క్రియ : మలబద్దక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రాక్ సాల్ట్ ను నిత్య ఆహారంలో తీసుకోవడం వల్ల ఎసిడిటీ, కడుపుబ్బరం లాంటి సమస్యలనుంచి బయటపడేస్తుంది. కావున తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు నిత్యం ఈ రాక్ సాల్ట్ వాడవలసి ఉంటుంది..