Sadabahar Flowers : ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటే… చర్మ సమస్యలకు దివ్య ఔషధం…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sadabahar Flowers : ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటే… చర్మ సమస్యలకు దివ్య ఔషధం…??

Sadabahar Flowers : మన ఇంటి చుట్టుపక్కల లేక రోడ్డు పక్కన అధికంగా ఉండే బిళ్ళ గన్నేరు అందరికీ తెలుసు. కానీ వీటిని సతత హరిత పుష్పాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే సదాబహార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కలను కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుపచ్చ రంగులోకి మారిన తరువాత ఇది ఎక్కువగా పోయడం మొదలుపెడుతుంది. ఈ ఎవర్ గ్రీన్ పూలను కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sadabahar Flowers : ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటే... చర్మ సమస్యలకు దివ్య ఔషధం...??

Sadabahar Flowers : మన ఇంటి చుట్టుపక్కల లేక రోడ్డు పక్కన అధికంగా ఉండే బిళ్ళ గన్నేరు అందరికీ తెలుసు. కానీ వీటిని సతత హరిత పుష్పాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే సదాబహార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మొక్కలను కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుపచ్చ రంగులోకి మారిన తరువాత ఇది ఎక్కువగా పోయడం మొదలుపెడుతుంది. ఈ ఎవర్ గ్రీన్ పూలను కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పూలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నట్లయితే, అవి పూలు పూస్తున్నట్లయితే, వాటితో అద్భుతమైన పేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీనివలన మీ ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది అని అంటున్నారు. అయితే అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

సతత హరిత పుష్పాలతో పేస్ ప్యాక్ తయారు చేసేందుకు ఎనిమిది ఎవర్ గ్రీన్ ఫ్లవర్స్ తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆ పూల పేస్టులు వేసుకుని దానిలో ఒక స్పూన్ బాదం ఆయిల్ మరియు రెండు స్పూన్ల పచ్చిపాలు, ఐదు స్పూన్ల రోజ్ వాటార్ ను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి మరియు మెడకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. దీనిని ఒక పావుగంట పాటు ఉంచి తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ఇంకొక పద్ధతిలో సదాబహార్ పూలు మరియు విటమిన్ ఇ క్యాప్సిల్స్ ను కలిసి కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక పది పూలను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో చిటికెడు పసుపు మరియు విటమిన్ ఇ క్యాప్సిల్స్, రెండు స్పూన్ల రోజు వాటార్ ను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను సుమారు 20 నుండి 25 నిమిషాల ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ముఖానికి రోజ్ వాటార్ ను అప్లై చేసుకోవాలి…

Sadabahar Flowers ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటే చర్మ సమస్యలకు దివ్య ఔషధం

Sadabahar Flowers : ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటే పొరపాటే… చర్మ సమస్యలకు దివ్య ఔషధం…??

ఎవర్ గ్రీన్ పూలు మరియు తేనె తో కూడా ఫేస్ ప్యాక్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక పది వరకు ఎవర్ గ్రీన్ పూలను తీసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మ రసం మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని ఒక పావుగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకుంటే మీ ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అంతేకాక ఈ ఎవర్ గ్రీన్ పూలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా అధికంగానే ఉన్నాయి. అందుకే చర్మంపై మొటిమలు వచ్చినప్పుడు ఈ పూలను పేస్టుగా చేసి అప్లై చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే గాయాలు తగిలిన చోట ఈ పూల పేస్ట్ ను రాసుకోవడం వలన కూడా తొందరగా తగ్గిపోతాయి

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది