Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా… ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు… దీని గురించి తెలుసా….?
ప్రధానాంశాలు:
Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా... ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు... దీని గురించి తెలుసా....?
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువే. ఇది హిమాలయ పర్వతాల వంటి ఎత్తైన ప్రాంతాలలోని శిలల నుండి ఊరే జిగురులాంటి పదార్థం. వందల ఏళ్లపాటు మొక్కలు కుళ్ళిపోయి, షీలాల ఒత్తిడికి గురికావడం వల్ల ఇది ఏర్పడుతుంది. శిలాజిత్తును సంస్కృతంలో శిలాజీతు లేదా శిలాజతూ అంటారు. దినీ అర్థం పర్వతాలను జయించేది. బలహీనతను నాశనం చేసేది అని.

Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా… ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు… దీని గురించి తెలుసా….?
Shilajit In Ayurveda శిల జిత్తును ఎందుకు ఉపయోగిస్తారు
ఆయుర్వేదం ప్రకారం శిలాజిత్ అనే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడడంతో పాటు నిత్యం యవ్వనంగా ఉంచటం లో సహాయపడుతుంది. రానికి కావలసిన శక్తిని అందించడంతో పాటుగా రోగనిరోధక శక్తి వ్యవస్థను బలపరచగలదు.ఇంకా నాడీ వ్యవస్థను బలపరిచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచడానికి, పేరుము నాణ్యతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇనుము స్థాయిని కూడా పెంచుతుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించుటకు సహాయ పడగలదు. పిండాలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించుతుంది. శరీరంలో వాపు,నొప్పి తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎస్ట్రాల స్థాయిలను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రజలు శిలాజిత్తును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు దీన్నే పాలతో కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇస్తారు. షెర్ఫా ప్రజలు తమ ఆహారంలో శిలాజిత్తును ఒక భాగంగా చేసుకుంటారు. దీనివల్ల వారు చాలా బలంగాను, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు. అజితులో ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, అనేక ఖనిజాలు ( క్యాల్షియం, మెగ్నీషియం,, ఇనుము, జింక్ ) ట్రెస్ ఎలిమెంట్స్ ఉంటాయి. పుల్విక్ యాసిడ్ ముఖ్యంగా పోషకాలను శరీరంలో లోతైన ఖనిజాలాలకు చేరవేయడంలో, శక్తి ఉత్పత్తిని పెంచడంలో ఎంతో బాగా సహాయపడగలదు.