Migraine Pain : మైగ్రేన్ నొప్పి నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా…ఈ టిప్స్ పాటించండి…
Migraine Pain : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే ఈ సమస్యలలో మైగ్రేన్ కూడా ఒకటి. అయితే ఈ మైగ్రేన్ ఉన్నవారికి తలనొప్పి అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. ఈ బాధ అనేది వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ నొప్పి అనేది తలకు ఒకవైపు నుండి స్టార్ట్ అయ్యి తల మొత్తం కూడా వ్యాపిస్తుంది. ఈ నొప్పి వలన ఏ పని చేయలేరు. ఈ బాధ వర్ణనాతీతం. అయితే మన శరీరంలో సెరోటోనిన్ రసాయన సమతుల్యతను మనం కోల్పోయినప్పుడు మైగ్రేట్ నొప్పి వస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్నో సందర్భాలలో మరియు జన్యుపరమైన కారణాల వలన కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మైగ్రేన్ వ్యాధి అనేది దీర్ఘకాలిక సమస్య అని కూడా చెప్పొచ్చు.
దాని నుండి తప్పించుకోవటం వీలుకాదు. అయితే ఈ మైగ్రేన్ లక్షణాలను మాత్రం తగ్గించవచ్చు. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించటం వలన ఈ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తగినంత నీరు కూడా తాగాలి. అంతేకాక ఒత్తిడిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు ఎండకి బయటకు వెళ్లకుండా ఉండాలి. ఇలా చేయటం వలన మైగ్రేన్ సమస్యను దూరం చేసుకోవచ్చు… మీరు పనిలో ఉన్నప్పుడు ఆకస్మాత్తుగా మైగ్రేన్ నొప్పి గనుక వస్తే ఈ హోమ్ రెమెడీస్ ను పాటించండి. ఇవి తలనొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే మీకు మైగ్రేన్ నొప్పి మొదలైనప్పుడు మొబైల్ లేక ల్యాప్ టాప్ లేక మొబైల్ స్క్రీన్ లేక లైట్ వైపుకు చూడకుండా ఉండాలి. అలాగే అల్లం మరియు మిరియాలు నిమ్మకాయతో టీ ని తయారు చేసుకుని తీసుకుంటే మంచిది.
ఈ టీ అనేది తల లోపల మంటను మరియు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది… మీకు తలనొప్పి అనేది మొదలైనప్పుడు కోల్డ్ కంప్రెస్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెడ మరియు తలపై కోల్డ్ కంప్రెస్ చేయటం వలన మైగ్రేన్ నొప్పి అనేది తగ్గుతుంది. అంతేకాక లావెండర్ ఎసెన్షియల్ నూనెతో తలకు మసాజ్ చేసుకున్నట్లయితే మైగ్రేడ్ నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయటం వలన తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ ఒక్కసారి గనక నొప్పి అనేది వస్తే అది కొన్ని రోజులపాటు వేధిస్తూనే ఉంటుంది. ఈ టైంలో మీరు అధికంగా నీరు తీసుకోవాలి. అలాగే టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే శరీరానికి నిద్ర అనేది ఎంతో అవసరం. కాబట్టి సరేనా నిద్ర వలన కూడా మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు…