Skin Care : వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో… అంతే సంగతులు… జాగ్రత్త…!!
ప్రధానాంశాలు:
Skin Care : వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో... అంతే సంగతులు... జాగ్రత్త...!!
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో మెరిసే చర్మం కోసం రకరకాల హోమ్ రెమెడీస్ ను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ చర్మాన్ని బట్టి సహజ సిద్ధమైన పదార్థాలను మాత్రమే వాడాలి. వీటిని గనుక సరిగ్గా వాడకపోతే ముఖం మెరిసే మాట పక్కన పెడితే హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కొన్నింటిని నేరుగా ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. అయితే మన చర్మం అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. కొన్నిటిని ముఖానికి నేరుగా అప్లై చేయడం వలన చికాకు మరియు దద్దుర్లు, అలర్జీ లాంటి సమస్యలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా వచ్చి పడతాయి. అయితే వేటిని ముఖానికి నేరుగా అప్లై చేయకూడదో తెలుసుకుందాం.
Skin Care ఎసెన్షియల్ ఆయిల్
ఈ ఆయిల్ ను ముఖానికి నేరుగా అప్లై చేయడం మంచిది కాదు. దీనికి బదులుగా కొబ్బరి లేక జోజోబా లేక బాదం నూనె లాంటి క్యారియర్ ఆయిల్ తో కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక చెంచా క్యారియర్ ఆయిల్ లో రెండు నుండి మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కలుపుకొని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఈ ఎసెన్సీయల్ ఆయిల్ ను ముఖానికి నేరుగా అప్లై చేయడం వలన ముఖంపై చికాకు మరియు చర్మ సమస్యలు అనేవి వస్తాయి…
సిట్రస్ పండ్లు : నిమ్మ మరియు ద్రాక్ష, నారింజ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మానికి మంచిది కానీ వీటిని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయకూడదు. ఉదాహరణకు నిమ్మకాయ మరియు టమాటాలు ముఖానికి నేరుగా అప్లై చేస్తే చికాకు మరియు ఎరుపు అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చర్మ సంరక్షణలో సిట్రస్ పండ్లను ఫేస్ ప్యాక్ లా వాడొద్దు. లేదంటే తక్కువ పరిమాణంలో మాత్రమే వాడండి. అలాగే సున్నితమైన మరియు పొడి చర్మం ఉన్న వారు మాత్రం ఈ సిట్రస్ పండ్లను డైరెక్ట్ గా ముఖానికి వాడొద్దు…
చక్కెర : చాలామంది స్క్రబ్ కోసం షుగర్ ను వాడుతూ ఉంటారు. అయితే ఈ షుగర్ ను ముఖానికి డైరెక్ట్ గా అప్లై చేయడం వలన శరీరంపై రాసేష్ వచ్చే అవకాశం ఉంది…
బేకింగ్ సోడా : చర్మ సంరక్షణ కోసం చాలామంది బేకింగ్ సోడాను కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇది చర్మం pH స్థాయిని పాడు చేయొచ్చు. దీని కారణం చేత చర్మం అనేది పొడిగా మరియు సున్నితంగా మారుతుంది. కాబట్టి బేకింగ్ సోడాను వాడటం మానేయండి…
అలోవెరా : Aloe Vera అలోవెరా జెల్ అనేది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం తాజా అలోవెరా జెల్ ను డైరెక్టుగా ముఖంపై అప్లై చేయడం వలన చికాకు మరియు దద్దుర్లు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే సున్నితమైన చర్మం ఉన్నవారు డైరెక్ట్ గా కలబందను వాడకండి. దీనిని రోజు వాటర్ లేక విటమిన్ ఈ క్యాప్సిల్స్ మరియు బాదం నూనెలో కలిపి రాసుకోండి…