Sleeping : నిద్ర భంగిమలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!
ప్రధానాంశాలు:
Sleeping : నిద్ర భంగిమలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం, నాణ్యమైన నిద్రపోవడం వల్ల మన దైనందిన జీవితం ఉత్సాహంగా సాగుతుంది. ముఖ్యంగా రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. మన నిద్రపోయే విధానం, భంగిమ ద్వారా మన వ్యక్తిత్వ లక్షణాలను కూడా తెలుసుకోవచ్చట. ఇది కేవలం నమ్మకం కాదు, పలు శాస్త్రీయ అధ్యయనాల్లోనూ ఇది స్పష్టమైంది.

Sleeping : నిద్ర భంగిమలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయోచ్చు.. అది ఎలాగంటే..!
Sleeping : ప్రతి ఒక్కరూ ఒకే విధంగా నిద్రపోరు. మీరు ఏ భంగిమలో నిద్రపోతారో.. దాని వెనుక దాగిన వ్యక్తిత్వం ఏమిటనేది చూస్తే..
-పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకునే వారు:
సెంసిటివ్ వ్యక్తులు
చిన్న విషయాలకే స్పందిస్తారు, బాధపడతారు.
ఎప్పుడూ లోపం వెతకడంలో మునిగిపోయి, అసంతృప్తితో జీవిస్తారు.
తాము చేయదలచిన పనిలో కష్టపడతారు, ఎమోషనల్‌గా బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది.
-కుడివైపున పడుకుని, కుడి చేయి తలకింద పెట్టుకునే వారు:
వీరికి ఆత్మవిశ్వాసం అపారం.
లీడర్‌షిప్ లక్షణాలతోపాటు డబ్బు, పేరుప్రతిష్ట వారి వెంట ఉండే అవకాశముంది.
ఈ వ్యక్తులు సాధారణంగా బహుముఖ ప్రజ్ఞాశాలులై ఉండే అవకాశం ఎక్కువ.
-ఎడమవైపున పడుకుని, ఎడమ చేయి తలకింద పెట్టుకునే వారు:
చాలా వినయవంతంగా, నిబద్దతతో జీవించే వ్యక్తులు.
పెద్దలను గౌరవిస్తారు, పనిపట్ల నిష్ట చూపిస్తారు.
క్రియేటివ్‌గా ఉంటారు, కానీ ఆత్మవిశ్వాసం కొంత తక్కువగా ఉంటుందట.
-వెల్లకిల్లా పడుకునే వారు:
వీరు నిజమైన ఫ్రీ బర్డ్స్!
అందరిలోనూ తాము ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు.
వారి ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి, వ్యక్తిత్వంలో ఓ ఆకర్షణ ఉంటుంది.
– బోర్లా పడుకునే వారు:
వీరు సంకుచిత స్వభావం కలవారు.
తమ పరిధిలో మాత్రమే జీవించడం ఇష్టపడతారు.
ఇతరులతో తక్కువగా చర్చిస్తారు, అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
– రెండు కాళ్లు ముడుచుకుని, ఒకవైపుగా వంగి పడుకునే వారు:
స్వార్థత, అసూయ, ప్రతీకారం వంటి గుణాలు ఎక్కువగా కనిపించవచ్చునని పరిశోధనలు సూచిస్తున్నాయి.
వీరు ఇతరుల పట్ల దూరంగా ఉంటారు, ఎంతో కొద్ది సమయంలోనే మోసపోవచ్చు.
భయభ్రాంతులకు ఎక్కువగా లోనవుతారు.