Sprays Harming : మీరు వాడే పెర్ఫ్యూమ్ తో సంతాన సమస్యలు… ఆ విషయంలో పురుషులకు సమస్యట…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sprays Harming : మీరు వాడే పెర్ఫ్యూమ్ తో సంతాన సమస్యలు… ఆ విషయంలో పురుషులకు సమస్యట…?

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Sprays Harming : మీరు వాడే పెర్ఫ్యూమ్ తో సంతాన సమస్యలు... ఆ విషయంలో పురుషులకు సమస్యట...?

Sprys Harming : ఈరోజుల్లో చాలామంది పర్ఫ్యూమ్స్ వాడందే బయటికి వెళ్లడం లేదు. ఇవి వాడితే మంచి సుగంధ భరితమైన వాసనను ఇస్తుందని దీనిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ పెర్ఫ్యూమ్స్,బాడీస్ప్రేలు మన శరీరానికి మంచి సుగందాన్ని ఇస్తాయని అనుకుంటాం. కానీ వీటితో కొన్ని రసాయన హార్మోన్లను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉందని తెలియదు. పర్ఫ్యూమ్స్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. చాలామంది, వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటిస్తూ శరీర సుగందానికి ప్రాముఖ్యతను ఎక్కువగా ఇస్తారు. అయితే బాడీ స్ప్రేలు,పెర్ఫ్యూమ్ లో వాడకం ఎక్కువైపోయింది. కొన్ని రసాయనాలు హార్మోన్లను దెబ్బతీసి, సంతాన సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది.వీటిలో ఉండే కొన్ని రసాయనాలు మన ఆరోగ్యం పైన, పునరుత్పత్తి వ్యవస్థల పైన చెడు ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sprays Harming మీరు వాడే పెర్ఫ్యూమ్ తో సంతాన సమస్యలు ఆ విషయంలో పురుషులకు సమస్యట

Sprays Harming : మీరు వాడే పెర్ఫ్యూమ్ తో సంతాన సమస్యలు… ఆ విషయంలో పురుషులకు సమస్యట…?

Sprays Harming రసాయనాల ప్రభావం

బాడీ స్ప్రేలు, పర్ఫ్యూమ్ లో తరచుగా ఉండే పారాబెన్స్ (parabens) ఫాతా లైట్స్ (phathalates) రసాయనాలు మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరిశోధనలు వెల్లడించారు.వీటిని ఎక్కువ కాలం పాటు చర్మంపై నేరుగా ఉపయోగిస్తే, శరీరం రసాయనాలను తక్కువ మోతాదులోనైనా హానికరమైన ప్రభావాలను కలిగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

పురుషుల, ఆరోగ్యం పై ప్రభావం : పురుషుల్లో టెస్ట్ వస్తేరాన్ అనే ముఖ్యమైన హార్మోను ప్రభావితం చేయగల గుణం ఈ రసాయనాల్లో ఉంది. ఈ హార్మోన్ల స్థాయి తగ్గిపోతే స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది.స్పెర్ము నాణ్యత పై దెబ్బ పడుతుంది. దీర్ఘకాలికంగా ఇది సంతానలేమికి దారి తీశా అవకాశం ఎక్కువగా ఉంది.డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఇటీవల ఇలా హార్మోన్ల మార్పుల వల్ల సమస్యలు ఎదుర్కొన్న యువకుల సంఖ్య పెరుగుతుందని పరిశోధనలు తేలింది.

మహిళల ఆరోగ్యం పై ప్రభావం : చూడకే కాదు మహిళలకు కూడా ఆ రసాయనాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్థాయిని తగ్గించడంలో ఈ పదార్థాల పాత్ర వహిస్తుంది. రజస్వల చక్రం,అసమానతలు ఆండోత్పత్తిలో అంతరాయం. గర్భం ధరించే సామర్థ్యం తగ్గుదల వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఎలా వాడాలి : దీని ప్రభావాన్ని తగ్గించాలంటే, కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా, బాడీ స్ప్రేల నేరుగా శరీరంపై స్ప్రే చేయడం మానుకోవాలి.దానికి బదులు దుస్తులపై మితంగా వాడితే, చర్మ రసాయనాలతో నేరుగా తాగకుండా ఉంటుంది. అలాగే గర్భవతులు హార్మోల సంబంధిత చికిత్సలు తీసుకున్నవారు,ఈ ఉత్పత్తుల వాడకంపై మరింత జాగ్రత్త వహించాలి.

ప్రకృతి సిద్ధమైన ఎంపిక : ఏవి వాడకూడదనేది కాదు, కానీ ఎక్కువ సహజ సుగందాలు వాడే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.తులసీ,లవంగం,నిమ్మ పండు వంటి సహజసుగంధ ద్రవ్యాలతో తయారయ్యే పెర్ఫయూమ్స్, ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి.ఇవి ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు నుండి
రక్షిస్తుంది.

వైద్య సలహా తప్పనిసరి : మీకు ఇప్పటికే హార్మోన్స్ సంబంధిత సమస్యలు ఉన్నా,లేదా సంతాన సమస్యలు ఉన్న,మీరు రోజు వాడుతున్న ఉత్పత్తిలో ఏమైనా సమస్య ఉందేమో అనుమానించినట్లయితే,వైద్యం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది