Summer Special : సమ్మర్ డ్రింక్ : ఈ వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్ లు తాగితే చాలు.. వేసవి తాపం తగ్గుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Summer Special : సమ్మర్ డ్రింక్ : ఈ వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్ లు తాగితే చాలు.. వేసవి తాపం తగ్గుతుంది…!

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Summer Special : సమ్మర్ డ్రింక్ : ఈ వేసవిలో ఉదయాన్నే ఈ జ్యూస్ లు తాగితే చాలు.. వేసవి తాపం తగ్గుతుంది...!

Summer Special : వేసవికాలం మొదలైంది. ఇక అందరూ కూడా వేసవి తాపం నుంచి బయటపడడానికి చల్ల చల్లగా కొన్ని రకాల కెమికల్స్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే ఈ కెమికల్స్ తో నిండి ఉన్న డ్రింక్స్ వేసివి తాపాన్ని తగ్గించలేవు.. వీటితో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే వేసవికాలంలో శరీరానికి శక్తినిచ్చే హెల్తీ డ్రింక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం… వేసవి కాలంలో ఎవరికైనా చెమటలు వస్తూ ఉంటాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శరీరాన్ని మనసుని చల్లపరచడానికి ఏదో ఒక కూల్ డ్రింక్ లాంటివి తాగుతూ ఉంటారు. అయితే మనం తాగే డ్రింక్ ఏదైనా ఆరోగ్య కరంగా ఉండాలి. మన శరీరం నుంచి కోల్పోయిన పోషకాలు నీటి శాతాన్ని మనం తిరిగి పొందాలి. కాబట్టి అటువంటి అరోగ్య కరమైన పానీయాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.

మజ్జిగ: వేసవి కాలంలో మజ్జిగ వాడకం చాలా మంచిది. ప్రతిరోజు మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగ నుండి మనకు క్యాల్షియం, ప్రోటీన్లు లభిస్తాయి. ఖాళీ కడుపుతో మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణశక్తిని పెంచి మన పొట్టలోని యాసిడిటీని కంట్రోల్ చేస్తుంది.

పుచ్చకాయ జ్యూస్ : పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవికాలంలో పుచ్చకాయ జ్యూస్ మన శరీరానికి ఎక్కువ నీటిని అందించి డిహైడ్రేషన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. దీనిలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణశక్తిని పెంచి మంట తగ్గిస్తుంది..శరీరాన్ని చల్లబరుస్తుంది.

లెమన్ జ్యూస్: విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ పండును ఏ రూపంలో అయినా తీసుకోవడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. ఇది మన జీర్ణం వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. మన శరీరం నుండి మంటను తగ్గిస్తుంది. ఇది సహజంగా మన శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. యాంటీ ఇంప్లిమెంటరీగా ఉపయోగపడుతుంది.

కీరదోస జ్యూస్: వేసవి లో కీరదోస శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువ నీటి శాతం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో కీరదోస జ్యూస్ తాగడం వల్ల మన జీర్ణశక్తి మెరుగవుతుంది. శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు: వేసవిలో కొబ్బరినీళ్లుకు డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో మనకి అధిక మొత్తంలో పొటాషియం లభిస్తుంది. ఇది రక్తపోటు నియంత్రించి మన శరీరాన్ని డిహైడ్రేషన్ నుండి కాపాడే గుణం కొబ్బరి నీళ్లకు ఉంటుంది. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువ ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో తాగడం వలన మన జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యం అంతమైన శరీరాన్ని అందిస్తుంది. ఎండాకాలం కావున చల్లని కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి మంచి మేలు జరుగుతుంది..

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది