Teeth Care : ఈ టిప్స్ పాటిస్తే చాలు… ఎంత గార పట్టిన పళ్ళేనా ముత్యాలా మెరిసిపోతాయి…!
ప్రధానాంశాలు:
Teeth Care : ఈ టిప్స్ పాటిస్తే చాలు... ఎంత గార పట్టిన పళ్ళేనా ముత్యాలా మెరిసిపోతాయి...!
Teeth Care : ప్రస్తుత కాలంలో శరీర అందం పై పెట్టే శ్రద్ధ చాలా మంది ఆరోగ్యం పై అస్సలు పెట్టరు. అయితే మెరిసే చర్మం అనేది ఎంత ముఖ్యమో, లోపల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అయితే చాలా మంది పళ్ళను అస్సలు పట్టించుకోరు. ఆ తర్వాత అవి పాడైపోయి గార పట్టి నల్లగా మారితే తప్పితే వాటిని జాగ్రత్తగా చూసుకోరు. అలాగే దంతాలు అనేది నల్లగా మరియు పసుపు రంగులోకి మారడానికి చాలా కారణాలు కూడా ఉంటాయి. వాటిల్లో కొన్ని సరిగ్గా బ్రష్ చేయకపోవడం మరియు మాంసాహారాన్ని అధికంగా తినడం, టి కాఫీలు అధికంగా తాగడం,దోమపానం, మద్యపానం, కూల్ డ్రింక్స్ లాంటివి అధికంగా తాగటం వలన దంతాల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది.
దంతాలు పసుపు రంగులోకి మారడం మరియు గార పట్టి నల్లగా ఉన్నప్పుడు నలుగురి లో తిరగాలి అన్న, మాట్లాడాలి అన్న, నవ్వాలి అన్న ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సమస్యను మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తొలగించుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వెల్లుల్లి అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కి ఉండే పొట్టు ను తీసేసి మెత్తగా దంచుకోవాలి. దాని తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం కలపాలి. అలాగే దీనిలో చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. దీంతో పేస్ట్ అనేది రెడీ అవుతుంది.
అయితే ఈ పేస్ట్ తో ప్రతి నిత్యం రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కొద్ది రోజుల్లోనే మీ పళ్ళ పై ఉండే గారా మరియు పసుపు రంగు అనేది పూర్తిగా పోతుంది. అలాగే పళ్ళు తెల్లగా ముత్యాల మెరిసిపోతాయి. అంతేకాక నీటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియను మరియు దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. ఇతర నోటీ సమస్యలను కూడా తగ్గిస్తుంది