Thalassaemia : పిల్లల ప్రాణాలు తీస్తున్న తలసేమియా.. దీని లక్షణాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Thalassaemia : పిల్లల ప్రాణాలు తీస్తున్న తలసేమియా.. దీని లక్షణాలు ఇవే..!
Thalassaemia : ఈ రోజుల్లో ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. చిన్న రోగాలు కూడా ప్రాణాలను హరిస్తున్నాయి. అందునా చిన్న పిల్లలకు అయితే ప్రాణాంతక జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుని, వాటి లక్షణాలు గుర్తిస్తే పిల్లలకు సరైన సమయంలో చికిత్స అందించవచ్చు. దాంతో ఈజీగా ఆ ప్రాణాంతక వ్యాధుల నుంచి బయట పడే అవకాశాల ఉంటాయి. ఇలాంటి వాటిలో తలసేమియా కూడా ఒకటి. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే ప్రాణాంతక వ్యాధి ఇది. అయితే ఈ వ్యాధి సమయంలో పిల్లల్లో ఎర్ర రక్తకణాలు బాగా తగ్గిపోతాయి.
కణాల జీవితం కాలం కూడా బాగానే తగ్గిపోతుంది. ఆ సమయంలో 21 రోజుల్లోనే పిల్లలకు ఒక యూనిట్ బ్లడ్ అవసరపడుతుంది. ఆ వ్యాధి బారిన పడిన పిల్లలు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటే అది ఎంత ప్రాణాంతక వ్యాధి అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు మే 8న తలసేమియా దినోత్సవాన్ని కూడా జరుపుతున్నారు. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్ మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Thalassaemia : తలసేమియా లక్షణాలు..
ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లలో మగతతో పాటు అలసటగా అనిపిస్తుంది.
అంతే కాకుండా ఛాతిలో నొప్పిగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో వారు చాలానే ఇబ్బందులు పడుతుంటారు. అంతే కాకుండా ఎదుగుదల కూడా ఆగిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక తలనొప్పి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.
అంతే కాకుండా ఈ వ్యాధి సోకిన సమయంలో కామెర్లు వస్తుంటాయి. దాంతో పాటు పలుచని చర్మం అలాగే తల తిరగడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Thalassaemia చికిత్స ఇదే..
ఈ వ్యాధి సోకినప్పుడు రక్తహీన స్క్రీనింగ్ తీయాలి. దాని ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈ వ్యాధి తీవ్రతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా తలసేమియా పిల్లల జీవితాతం ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి రక్తమార్పిడులు చేసుకుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, జీన్ థెరపీ, జింటెగ్లో థెరపీ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది.