Foods : పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. చాలా డేంజర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Foods : పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. చాలా డేంజర్..!

Foods : చిన్న పిల్లలకు పేరెంట్స్ ఇష్టంతో రకరకాల ఫుడ్స్ కొనిస్తుంటారు. ఇప్పుడు పిల్లలను బేస్ చేసుకునే చాలారకాల ఫుడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే పేరెంట్స్ కూడా తమ పిల్లలకు తాము దగ్గరవుతున్నామనే ఉద్దేశంతో పాటు వారి సంతోషం కోసం ప్రేమతో వారు ఏది అడిగితే అది వాళ్లు కొనిస్తుంటారు. అయితే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటుంటారు. దాంతో వారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా అది వారి ఆరోగ్యానికి కూడా చాలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,10:30 am

ప్రధానాంశాలు:

  •  Foods : పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. చాలా డేంజర్..!

Foods : చిన్న పిల్లలకు పేరెంట్స్ ఇష్టంతో రకరకాల ఫుడ్స్ కొనిస్తుంటారు. ఇప్పుడు పిల్లలను బేస్ చేసుకునే చాలారకాల ఫుడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే పేరెంట్స్ కూడా తమ పిల్లలకు తాము దగ్గరవుతున్నామనే ఉద్దేశంతో పాటు వారి సంతోషం కోసం ప్రేమతో వారు ఏది అడిగితే అది వాళ్లు కొనిస్తుంటారు. అయితే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటుంటారు. దాంతో వారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా అది వారి ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ అవి ఏం ఫుడ్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Foods చిప్స్..

పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ లో చిప్స్ తింటుంటారు. ఈ చిప్స్ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ చిప్స్ లో ఉప్పు, కొవ్వులు, కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిని తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే పిల్లల్లో చిన్న వయసులోనే ఊబకాయం వచ్చేస్తుంది.

Foods నూడుల్స్..

నూడుల్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నూడుల్స్ అనేది చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందని పేరెంట్స్ భావిస్తుంటారు. పైగా పిల్లలు కూడా టేస్టీగా తింటారని భావిస్తారు. కానీ ఇందులో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. పోషకాలు ఉండవు. కాబట్టి వీటి వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదమే ఉంటుంది.

Foods పిజ్జాలు..

ఈ కాలంలో పిజ్జాలు తినడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అయితే ఇందులో చీజ్, సాస్ లు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే బాడీలో కేలరీలు, కొవ్వులు పెరిగిపోతాయి. బరువు పెరుగుతారు. జీర్ణ క్రియ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కడుపునొప్పితో పాటు ఇతర సమస్యలు వస్తాయి.

Foods పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా చాలా డేంజర్

Foods : పిల్లలకు ఈ ఫుడ్స్ పెడుతున్నారా.. చాలా డేంజర్..!

Foods బర్గర్లు..

బర్గర్లను కూడా ఎక్కువగా తింటుంటారు జనాలు. అయితే వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేసి రెడీ చేస్తారు. పైగా ఇందులో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంతే కాకుండా ఇవి కొవ్వులు, కార్పొ హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా ప్రమాదకరం అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది