Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…??

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా... పరిశోధన ఏం చెబుతుందంటే...??

Over Eating : మనిషి జీవించటానికి ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం ఏం తీసుకుంటున్నామో అదే ఫలితం మన శరీరంపై పడుతుంది. అయితే ఆహార తీసుకునే విధానం వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మితిమీరి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది అనే సంగతి తెలిసిందే. ఇంతకీ మితిమీరి ఆహారం మనిషి ఎందుకు తీసుకుంటాడో తెలుసా.? అదేం ప్రశ్న ఎంతో రుచిగా ఉంటేనో లేక ఆకలిగా ఉంటేనే తింటారు అని అంటారు కదూ. అయితే దీనికి పరిశోధకులు ఒక శాస్త్రీయ కారణాన్ని తెలిపారు. ఆ కారణాలు ఏంటో చూద్దాం…

మితిమీరిన ఆహారం మనసులు ఎందుకు తీసుకుంటారు అనే దానికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. సాధారణంగా శరీరంలోని గడియారానికి అనుకూలంగా ఆహారాన్ని తింటామా లేదా అనే దానిపై కాలేయం నుండి మెదడుకు కొన్ని సంకేతాలు వెళతాయి. అయితే ఈ సంకేతాలలో అవరోధాలు అనేవి ఏర్పడితే మనిషి మితిమీరి ఆహారం తీసుకుంటాడు అని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు మరియు వేల కానీ వేళలో నిద్రపోయేవారి లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. దీనివలన ఊబకాయం మరియు మధుమేహం లాంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. మన శరీర గడియారంలో తలెత్తే అవరోధాల వలన ఈ సమస్య అనేది వస్తుంది అని అంటున్నారు…

Over Eating మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా పరిశోధన ఏం చెబుతుందంటే

Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…??

రాత్రి వేళలో కానీ వేల గాని వేళలో పనిచేయడం వలన కాలేయ అంతర్గత గడియారం మరియు దాని సంకేతాలలో అవరోధాలు వస్తున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు కనుక్కున్నారు. దీనిని తగ్గించడానికి మెదడు చేసే ప్రయత్నాలే మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారి తీస్తాయి అని అంటున్నారు. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా తినడానికి కారణం ఇదే అది నిపుణులు అంటున్నారు

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది