Thyroid : థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు తినకూడని ఐదు ఆహార పదార్థాలు ఇవే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thyroid : థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు తినకూడని ఐదు ఆహార పదార్థాలు ఇవే…!!

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2024,11:00 am

Thyroid : ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక్కసారిగా బరువు పెరగడం లేక తగ్గడం మరియు నిత్యం జలుబు,దగ్గు రావడం, మొటిమలు మరియు ఆందోళన ఇవన్నీ కూడా థైరాయిడ్ యొక్క లక్షణాలే. ఈ సమస్య అనేది దీర్ఘకాలంగా ఉంటుంది. అయితే ఈ సమస్య అనేది వచ్చింది అంటే చాలు రోజు దీనికి మందులు వాడాల్సిందే. అయితే మన శరీరంలో థైరాయిడ్ హార్మోల సమతుల్యతను రక్షించుకోనేందుకు మరియు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మందులు ఎంతో అవసరం. అయితే దీనికి కేవలం మందులు తీసుకుంటే సరిపోదు. ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే ఆ జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం…

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు తినకూడని ఐదు ఆహార పదార్థాలు ఇవే. వీటిని తీసుకోవడం వలన మీరు వేసుకునే మందుల ప్రభావాన్ని కూడా పాడు చేస్తాయి. అలాగే థైరాయిడ్ పేషెంట్లు సోయా ఆహారాలకు ఎంతో దూరంగా ఉండాలి అని ఎన్నో అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. థైరాయిడ్ మందులు సరిగ్గా పనిచేయక పోవడానికి కూడా కారణం అవుతుంది. అలాగే సోయాబీన్స్,సోయా పాలు, టోఫు లాంటి ఆహారాలకు ఎంతో దూరంగా ఉండాలి. అలాగే క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ లాంటి ఆహారాలు తీసుకోవడం వలన ఇవి మందుల ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు క్యాబేజీ లాంటి కూరగాయలకు ఎంతో దూరంగా ఉండాలి…

ప్యాక్ చేసిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు అనేవి థైరాయిడ్ పేషెంట్ల బరువును పెంచుతాయి. అలాగే శారీరక సమస్యలను కూడా పెంచుతాయి. ఇలాంటి ఆహారములో ఉప్పు మరియు చక్కెర అనేవి అధికంగా ఉంటాయి. మీకు గనక థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే స్వీట్లు తినడం పూర్తిగా మానేయాలి. చాలా తక్కువ పరిమాణంలో చక్కెరను తీసుకోవాలి. అయితే ఇవి థైరాయిడ్ రోగుల యొక్క బరువును మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అలాగే తీపి ఆహారాలకు కూడా దూరంగా ఉండటమే మంచిది. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు అధికంగా కాఫీని తాగటం కూడా మంచిది కాదు. ఖాళీ కడుపుతో కూడా కాఫీని అస్సలు తాగకూడదు. అయితే థైరాయిడ్ కి సంబంధించిన మందులను తీసుకునే అరగంట ముందు లేక తర్వాత కూడా కాఫీ ని అస్సలు తీసుకోకూడదు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది