Mayonnaise : మయోనీస్ ను ఎక్కువగా తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే…!!
ప్రధానాంశాలు:
Mayonnaise : మయోనీస్ ను ఎక్కువగా తినేవారు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇవే...!!
Mayonnaise : ప్రస్తుత కాలంలో ఆహార విషయములో అధికంగా పాపులర్ అయిన ఆహారాలలో మయోనీస్ కూడా ఒకటి. ఈ మయోనీస్ ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీనితో పాటుగా శాండ్విచ్, బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. దీని టెస్ట్ కి ఎంతో మంది బానిసలు కూడా అవుతున్నారు. కానీ ఈ మయోనీస్ అనేది స్లో పాయిజన్ లా పని చేసి ఆరోగ్యంపై ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయం ఎవరు గుర్తించలేకపోతున్నారు…
ఈ మయోనీస్ ను తీసుకోవటం వలన రాని రోగం అంటూ ఏది ఉండదు. దీనిలో కెలరీలు కూడా అధికంగా ఉంటాయి. దీని వలన మీరు అధికంగా వెయిట్ కూడా పెరుగుతారు. అంతేకాక గుండె జబ్బులు మరియు ఉబకాయం, షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా బాగా పెరిగిపోతాయి. అయితే ఈ మయోనీస్ లో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఉన్నప్పటికీ కూడా దీనిని అధికంగా మాత్రం అసలు తినకూడదు…
ఈ మయోనీస్ ను ఎక్కువగా గుడ్ల తో తయారు చేస్తారు. అందుకే దీనిని సరిగ్గా స్టోరేజ్ చేయకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యో అవకాశం ఉంటుంది. అలాగే చెడిపోయినటువంటి మయోనీస్ ను తీసుకుంటే వాంతులు మరియు విరేచనాలు, వికారం లాంటి లక్షణాలకు దారి తీస్తుంది. అలాగే ఈ మయోనీస్ ను తీసుకోవడం వలన టైప్ టు డయాబెటిస్ కూడా వస్తుంది. అలాగే షుగర్ వ్యాధి కూడా వస్తుంది…