BP Tablets : బీపీ టాబ్లెట్స్ వాడేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే…!
ప్రధానాంశాలు:
BP Tablets : బీపీ టాబ్లెట్స్ వాడేవారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే...!
BP Tablets : ప్రస్తుత కాలంలో హై బీపీ సమస్య అనేది చాలా సాధారణంగా మారింది. మన జీవనశైలి మరియు ఇతర కారణాల వలన చిన్న వయసులోని బీపీ సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొంతమందికి హైబీపీ ఉన్నా కూడా లక్షణాలు అనేవి కొనపడవు. అందువలన అప్పుడప్పుడు హై బీపీని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అంతేకాక బీపీకి సంబంధించిన టాబ్లెట్లు వాడేవారు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. బీపీ ఉన్నటువంటి వారు బీపీకి సంబంధించిన టాబ్లెట్లను ఎంత తొందరగా వాడడం మొదలుపెడితే అంత తొందరగా గుండె సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు అని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే బీపీకి మందులు వాడుతున్నటువంటి వారు తరచుగా కొన్ని చిట్కాలను కూడా ఫాలో అవ్వాలి అని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
– మొట్టమొదట ఫాలో అవ్వాల్సినది ప్రతిరోజు మందులను కచ్చితంగా వాడాలి. రాత్రిపూట వాడే మందులను రాత్రిపూట వాడాలి. అలాకాకుండా టాబ్లెట్లను మర్చిపోతూ ఇష్టం వచ్చినట్లుగా వాడటం వలన మన శరీర వ్యవస్థలు అనేవి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి…
బీపీకి సంబంధించిన మందులు వాడేవారు తెలుసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటి అంటే. ఎప్పుడైనా మీకు విపరీతంగా విరేచనాలు అవుతున్న లేక వాంతులు అవుతున్న లేక జ్వరంతో బాధపడుతున్నప్పుడు లో బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి టైం లో ఇంటి దగ్గర బీపీ చెక్ చేసుకుని బీపీ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే టాబ్లెట్లను వేసుకోవాలి…
– మీరు ఆహారంలో ఒక్కసారిగా విపరీతంగా మార్పులు చేసినట్లయితే, అప్పుడు బీపీలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో ఉప్పు అనేది పూర్తిగా తగ్గించినా లేక ఉప్పు ఎక్కువగా తీసుకున్న ప్రతిరోజు ఇంటి దగ్గర బీపీ ని చెక్ చేసుకుని బీపీలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను వైద్యులకు తెలియజేయాలి. దీంతో వారు మెడిసిన్స్ డోస్ అడ్జస్ట్ చేసి ఇస్తారు. వైద్యుల సలహా మేరకు మందులను వాడటం మంచిది.
పైన చెప్పిన వాటిని పాటించటం వలన మీరు వేసుకున్నటువంటి టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను చాలా వరకు నియంత్రించవచ్చు అని డాక్టర్ పీఎస్ వలీ తెలిపారు…