Glowing Face : మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే … ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు…!
Glowing Face : పండగలు వచ్చాయి అంటే చాలు ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. ఈ పండగల టైంలో ఆడవారికి ఎక్కువ పని ఉంటుంది. ఈ తరుణంలో అన్ని పనులను చేసేసరికి వారి యొక్క ముఖం డల్ గా మరియు నీరసంగా ఉంటుంది. కానీ మీరు ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు. ఈ దీపావళికి ఈ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. మీ ముఖంలో అప్పటికప్పుడే మంచి గ్లో కనిపించాలి అంటే కుంకుమపువ్వు తో పేస్ ప్యాక్ […]
ప్రధానాంశాలు:
Glowing Face : మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ... ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు...!
Glowing Face : పండగలు వచ్చాయి అంటే చాలు ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు. ఈ పండగల టైంలో ఆడవారికి ఎక్కువ పని ఉంటుంది. ఈ తరుణంలో అన్ని పనులను చేసేసరికి వారి యొక్క ముఖం డల్ గా మరియు నీరసంగా ఉంటుంది. కానీ మీరు ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు. ఈ దీపావళికి ఈ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. మీ ముఖంలో అప్పటికప్పుడే మంచి గ్లో కనిపించాలి అంటే కుంకుమపువ్వు తో పేస్ ప్యాక్ ను తయారు చేసుకోవాలి.
దీని కోసం కుంకుమ పువ్వును పాలలో రాత్రంతా నానబెట్టాలి. మీరు ఉదయం లేచిన వెంటనే దానిలో కొద్దిగా తేనె మరియు సెనగపిండిని కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకొని ఒక పావుగంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే పసుపుతో కూడా చర్మం మెరుస్తుంది. అలాగే సెనగపిండిలో కొద్దిగా పసుపు మరియు తేనె పెరుగు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన మీ స్కిన్ ఎంతో మెరిసిపోతుంది.
రోజ్ వాటర్ తో కూడా మీ స్కిన్ ను మెరిపించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలోకి రోజు వాటర్ ను తీసుకొని దానిలో దూది వేసి ఆ దూది సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా గనక మీరు గంటకి ఒకసారి చేసినట్లయితే మీ చర్మం ఫ్రెష్ గా మరియు గ్లో గా మారుతుంది. అలాగే బాదం నూనెతో కూడా ముఖాన్ని మెర్పించవచ్చు. అలాగే మీరు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మీరు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.