Thippatheega : తిప్పతీగతో ఎన్ని అద్భుత లాభాలో తెలుసా.. రోజుకు రెండు ఆకులు తింటే చాలు!
Thippatheega : తిప్పతీగ అంటే ఆయుర్వేదంలో అమృతంతో సమానమని దీనికి ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కచ్చితంగా ప్రతి ఇంటి వద్ద కూడా ఈ తిప్పతీగను చూడవచ్చు.కానీ ఈ తిప్పతీగ లో ఉన్న ఔషధ గుణాల గురించి ఎవరికి సరిగా తెలిసి ఉండదు. ఈ తిప్పతీగను ముఖ్యంగా ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.తిప్పతీగ వలన కలిగే లాభాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ తిప్పతీగ లాభాలు గురించి, ఆయుర్వేదంలో తగిన రహస్యాలు గురించి చాలామందికి తెలియదు. తిప్పతీగ తీగలాగా పాకుతూ పచ్చని ఆకులతో ఎన్నో లాభాలను కలిగిస్తుంది.ఈ తిప్పతీగ ఆకులను కనీసం రెండు ఆకుల నైనా తినటం వలన ఎన్నో లాభాలు కలుగుతున్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ తిప్పతీగను చూర్ణం లాగా కానీ, పౌడర్ గా గాని, జ్యూస్ లాగా కానీ, చేసుకొని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ తిప్పతీగను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఆయుర్వేద ఔషధ గని. తిప్పతీగ సైంటిఫిక్ నేమ్ తినొస్పోర కోర్డిఫోలియాఈ తిప్పతీగను యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి.ఇది డెంగ్యూ జ్వరం వంటి సాధారణ సూక్ష్మజీవుల కారణంగా వచ్చే అంటు వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ తిప్పతీగ బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని తెలుగు పరుస్తుంది. కాలేయాన్ని కూడా రక్షించడంలో ఉపయోగపడుతుంది.
Thippatheega :ఈ తిప్పతీగ వల్ల కలిగే లాభాలు..
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో ఈ తిప్పతీగ అద్భుతాన్ని చేస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకత మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. మహిళలలో రుతుక్రమం సమస్యల్లోనూ, ఎముకల సమస్యలు ఈ తిప్పతీగ ఎంతో మేలు చేస్తుంది.ఈ తిప్పతీగ పురుషులలో కూడా లైంగిక పనితీరును మెరుగుపరచడంలో పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల నుంచి కూడా ఈ తిప్పతీగ తీసుకోవడం వల్ల కలిగే లాభం అంతా ఇంతా కాదు.ఈ తిప్పతీగ శ్వాసకోశ సమస్యల నుంచి కూడా మంచి మేలును కలిగిస్తుంది. అందుకే కరోనా వ్యాధిగ్రస్తులు కూడా తిప్పతీగను తినడం చాలా మంచిద ని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.