Tiger Nuts : టైగర్ నట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Tiger Nuts : టైగర్ నట్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా...!!
Tiger Nuts : మనం ఆరోగ్యం కోసం ఎన్నో రకాల నట్స్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే వీటిలలో ఒకటి టైగర్ నట్స్. అయితే బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ ఇవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ టైగర్ నట్స్ గురించి ఎవరికీ తెలియదు. వీటిలో మిగతా వాటికంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ టైగర్ నట్స్ లో విటమిన్ ఇ,మినరల్స్, ఫైబర్ లాంటి ఎన్నో రకాల పోషకాలు కూడా దాగి ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి. దీనిలో ఉన్నటువంటి ఫైబర్ అనేది మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఈ నట్స్ ను గనక మీరు డైట్ లో చేర్చుకుంటే మీ జీర్ణక్రియ అనేది ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. అలాగే జీర్ణం కానీ ఆహారాన్ని కూడా ఇది జీర్ణం చేయగలదు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన కడుపునిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది…
ఈ టైగర్ నట్స్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఈ నట్స్ లో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉన్న ఫైబర్ పెద్ద పేగులోని చక్కెర శోషణను కూడా అడ్డుకుంటుంది. దీంతో బ్లడ్ షుగర్ అనేది అదుపులో ఉంటుంది. అలాగే ఈ నట్స్ లో 18 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. వీటిలో గుడ్డుకు సమానంగా ప్రోటీన్ అనేది ఉంటుంది. వీటిని తినడం వలన ఎముకలు అనేవి ఎంతో బలంగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ఈ టైగర్ నట్స్ లో కాల్షియం అనేది అధికంగా ఉండడం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. అలాగే టైగర్ నట్స్ లో ఉన్న మోనో శాచురేటెడ్ కొవ్వు అనేది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే గుండె జబ్బులు మరియు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి,విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాల ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే క్యాన్సర్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది…