Uric Acid : యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టాలంటే… కరివేపాకు ఇలా తినండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uric Acid : యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టాలంటే… కరివేపాకు ఇలా తినండి…

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Uric Acid : యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టాలంటే... కరివేపాకు ఇలా తినండి...

  •  Uric Acid : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్.. ఈ సమస్య వచ్చిందంటే నొప్పులతో ఎంతో ఇబ్బంది పడవలసి ఉంటుంది..

  •  యూరిక్ యాసిడ్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారంలో కరివేపాకు పొడిని చేర్చుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది.

Uric Acid : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య యూరిక్ యాసిడ్.. ఈ సమస్య వచ్చిందంటే నొప్పులతో ఎంతో ఇబ్బంది పడవలసి ఉంటుంది.. ఇది వచ్చిందంటే ఉదయం లేవగానే కాలు కింద పెట్టలేకపోవడం, పాదాలలో తీవ్రమైన నొప్పి, పాదాలు ఉబ్బడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ మన రక్తంలో ఉంటుంది. దీని లెవెల్స్ పెరిగితే కిడ్నీలు దీనిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అధిక యూరిక్ యాసిడ్ వల్ల ప్రమాదం; యూరిక్ ఆసిడ్ పెరగడం వల్ల కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అధిక యూరిక్ ఆసిడ్ కారణంగా కీళ్లలో నొప్పి, గౌట్ సమస్య వస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కరివేపాకు పొడిని తీసుకోవచ్చు.. దీని తినడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ మెయింటెనెన్స్ చేయవచ్చు. కరివేపాకు అన్ని వంటకాలలో వినియోగిస్తూ ఉంటాం. దీని రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

యూరిక్ యాసిడ్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారంలో కరివేపాకు పొడిని చేర్చుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. కరివేపాకులో విటమిన్ సి, ఏ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి ఇవి చాలా బాగా సహాయపడతాయి.. కరివేపాకు పొడిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకటి నుండి రెండు స్పూన్ల కరివేపాకు పొడిని తీసుకోవాలి. ఇలా చేయడం వలన పెరిగిన యూరిక్ యాసిడ్ కంట్రోల్ లో ఉంటుంది.భోజనం చేసే సమయంలో మొదటి రెండు ముద్దుల్లో కరివేపాకు పొడి మరియు కలుపుకొని తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

Uric Acid యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టాలంటే కరివేపాకు ఇలా తినండి

Uric Acid : యూరిక్ యాసిడ్ కి చెక్ పెట్టాలంటే… కరివేపాకు ఇలా తినండి…

ఐదు సంవత్సరాలు దాటిన వారి దగ్గర నుంచి ఏ వయసు ఎవరైనా ఈ కరివేపాకు పొడిని తీసుకోవచ్చు.. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో అదనంగా పెరిగిపోయి ఉన్న కొవ్వు మరియు కేలరీలు తగ్గుతాయి.. ఈ కరివేపాకు పొడిలో ఐరన్, పోలిక్, యాసిడ్ అధికంగా ఉంటాయి. దానివల్ల ప్రతిరోజు కరివేపాకు పొడిని తెనతో కలిపి తీసుకుంటే రక్త వృద్ధి జరిగే రక్తహీనత దూరమవుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.. దీనిలో ఉండే పలు పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అదే సమయంలో ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది