Tomatoes : అధిక రక్తపోటును నివారించడానికి టమోటాలు సాయపడతాయా.? వైద్యులు ఏమంటున్నారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tomatoes : అధిక రక్తపోటును నివారించడానికి టమోటాలు సాయపడతాయా.? వైద్యులు ఏమంటున్నారో తెలుసా..?

Tomatoes : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహార మార్పులు వలన వయసు తరహా లేకుండా చాలామంది ఇబ్బంది పడే వ్యాధులలో లలో ఒకటి అధిక రక్తపోటు. అయితే కొందరిలో హై బిపి ఉంటుంది. ఇంకొందరులో లో బీపీ ఉంటుంది. అయితే కొందరు అధిక రక్తపోటుతో చాలా ప్రమాదం ఉంటుందని చెప్తుంటారు. అయితే లో బీపీ ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అలాగే అధిక రక్తపోటు రావడానికి కారణాలంటూ […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 January 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Tomatoes : అధిక రక్తపోటును నివారించడానికి టమోటాలు సాయపడతాయా.? వైద్యులు ఏమంటున్నారో తెలుసా..?

Tomatoes : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహార మార్పులు వలన వయసు తరహా లేకుండా చాలామంది ఇబ్బంది పడే వ్యాధులలో లలో ఒకటి అధిక రక్తపోటు. అయితే కొందరిలో హై బిపి ఉంటుంది. ఇంకొందరులో లో బీపీ ఉంటుంది. అయితే కొందరు అధిక రక్తపోటుతో చాలా ప్రమాదం ఉంటుందని చెప్తుంటారు. అయితే లో బీపీ ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అలాగే అధిక రక్తపోటు రావడానికి కారణాలంటూ ఏమీ లేవు అని చెప్తున్నారు. ఇలాంటి సమస్యలను మీరు ముందే గమనించగలిగితే దీని నుంచి బయటపడవచ్చు.. అలాగే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేయవచ్చు..

కొన్ని పరిశోధనల ప్రకారం టమాట తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని కంట్రోల్ చేయవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..అయితే అసలు పరిశోధనలు ఏం తేలింది.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు మనం తెలుసుకుందాం… టమాటాలతో అధిక రక్తపోటు నివారించవచ్చా: టమాటాలు అనేవి మనం ప్రతికూరలో వాడుతూ ఉంటాం. టమాట లేకపోతే ఆ కూర రుచి అనిపించదు. అందుకే రేటు తక్కువైనా ఎక్కువైనా దీనిని కొనుగోలు చేస్తూ ఉంటారు. టమాటాలలో పొటాషియం, విటమిన్ సి, పోలేట్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచి మేలు చేస్తాయి. టమాటాలో ఉండే లైకోపీన్ గుండెకు చాలా మంచి చేస్తుంది. రోజుకు 110 గ్రాముల కంటే ఎక్కువ టమాటాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది.

ఎక్కువగా పొటాషియం ఉన్న ఆహారాలు తీసుకుంటే అధిక రక్తపోటు నుంచి బయటపడవచ్చు..అలాగే దీర్ఘకాలిక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.. అధిక రక్తపోటుకు చెక్ పెట్టి చిట్కాలు: మీరు ఆందోళన అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పండ్లు కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది. కొవ్వు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం మంచిది. బరువు అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.. ఇలాంటివన్నీ చేస్తూ ఆహారంలో మార్పులు చేసుకున్నట్లయితే అధిక రక్తపోటు కి చెక్ పెట్టవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది